Ad Code

Responsive Advertisement

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయం - సూళ్లూరుపేట.

ఈ అమ్మవారి ఆలయం సూళ్లూరుపేట కాళంగి నది తీరంలో కొలువైఉంది. ఈ అమ్మవారు స్వయంభూగా వెలసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.



సుమారు 400 సంవత్సరాల క్రితం ఆ ఊరిలోని గ్రామస్తులకు అమ్మవారి విగ్రహం కనపడింది. వాళ్ళు ఎంత కదిలించిన అమ్మవారి విగ్రహం అక్కడినుండి కదల లేదు. పూజలు చేసిన తరువాత అమ్మవారి విగ్రహం కదిలింది. తరువాత తీసుకువచ్చి ప్రస్తుత ఉన్న దగ్గర అమ్మవారిని ప్రతిష్టించారు.

మొదట అమ్మవారిని దక్షిణ కాళీగా కొలిచేవాళ్లు, తరువాత చెంగాళమ్మగా అమ్మవారు కి పూజలు చేయడం జరుగుతోంది.

ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శుక్ర, అది వారాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

ముఖ్యమైన పండుగలు :

దసరా,ఉగాది,సంక్రాంతి.

ఎలా వెళ్ళాలి :

సూళ్లూరుపేట బస్టాండ్ నుండి కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

శ్రీ అలగనాధ స్వామి ఆలయం మానారుపోలూరు - 3(కిమీ దూరంలో)

శ్రీ కాళహస్తి - 40

Post a Comment

0 Comments