Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం - అబ్బిరాజుపాలెం (పశ్చిమ గోదావరి).



పశ్చిమగోదావరి జిల్లా,అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం గోదావరి నది ఒడ్డున కొలువై ఉన్నది.ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా భక్తులనుండి పూజలందుకొనుచున్నారు.

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు  శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామివారు.దక్షిణభారతదేశంలో త్రిముఖ (3ముఖములు)ఆంజనేయస్వామి వారి విగ్రహాలు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తాయి.

ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం అబ్బిరాజుపాలెం గ్రామానికి సమీపంలో దొడ్డిపట్ట అను గ్రామము కలదు. ఆ గ్రామంలో తండూరి మూలస్వామి మరియు సోమరాణి దంపతులకి త్రిమూర్తులవ్రతం చేయుట వల్ల వారికి సంతానం కలిగినది. ఆ బాలునికి త్రిమూర్తులు అని పేరు పెట్టారు. త్రిమూర్తులు బాల్యం నుండి ఆంజనేయ స్వామికి పరమభక్తుడు. ఒకనాడు త్రిమూర్తుల(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు) యొక్క అనుగ్రహం వలన ఆ బాలునికి త్రిముఖ ఆంజనేయ స్వామి దర్శనం కలిగినది.



ఆ బాలుడు హనుమంతుడిని ప్రార్ధిస్తూ స్వామివారిని అక్కడే భక్తులందరికి దర్శనం ఇవ్వమని కోరగా స్వామివారు త్రిముఖ ఆంజనేయ స్వామిగా వెలిసెను. ఇక్కడ త్రిముఖ ఆంజనేయ స్వామి స్వయంభువుగా (స్వయంగా భగవంతుడే) వెలిశాడని ప్రతీతి.

ముఖ్యమైన పండుగలు :

స్వామివారి బ్రహ్మోత్సవాలు
హనుమాన్ జయంతి
ముక్కోటి ఏకాదశి
ఆలయ వార్షిక ఉత్సవాలు.

ఆలయ వేళలు 

ఉదయం 5  నుండి రాత్రి 9 వరకు .

ఎలా వెళ్ళాలి :

పాలకొల్లు నుండి 15  కి.మీ దూరంలో, భీమవరం నుండి 40 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

అప్పనపల్లి శ్రీ బాలాజీ ఆలయం - 14 (కి.మీ దూరంలో)
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం - 15
ఆచంట  రామలింగేశ్వర స్వామి ఆలయం - 16
అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి - 36
భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి - 38 
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి - 76

Post a Comment

0 Comments