Ad Code

Responsive Advertisement

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం - అప్పలాయగుంట



తిరుమల చుట్టు ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వర ఆలయాలలో  అప్పలాయగుంట ఆలయం ఒక్కటి.ఈ ఆలయం  చిత్తూరు జిల్లాలో వుంది.ఇక్కడ స్వామి వారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయాలు కూడా వున్నాయి. స్వామి వారు అభయ ముద్రతో దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రతేక్యత.

శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాసమంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా  తిరుమల చేరాడని స్థల పురాణం.

స్వామివారికి శుక్రవార అభిషేకం విశేషంగా జరుగుతుంది. 



ముఖ్యమైన పండుగలు

వైకుంఠ ఏకాదశి
బ్రహ్మోత్సవాలు
ఉగాది
దీపావళి
రథసప్తమి
ఆణివార ఆస్థానం
కల్యాణోత్సవం

ఆలయ వేళలు :

ఉదయం 06.00 నుండి రాత్రి 08.00 వరకు. 

ఎలా వేలాలి :

తిరుపతి నుండి 16 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం - 12 కి.మీ 
తిరుపతి శ్రీ గోవిందరాజా స్వామి వారి ఆలయం - 17
తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం - 17
తిరుపతి ఇస్కాన్ - 19
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం - 22 కి.మీ 

Post a Comment

0 Comments