Ad Code

Responsive Advertisement

శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం - బుచ్చిరెడ్డిపాళెం.



ఈ ఆలయం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఉంది.ఈ ఆలయం చాల పురాతనమైనది. ఈ ఆలయంలో చాల  ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు  1.25 ఎకరాలలో ఆలయం ఉంది.ఈ ఆలయం 17వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.

ఈ ఆలయ రాజగోపురం 100 అడుగుల ఎత్తులో, ధ్వజస్తంభం 50 అడుగుల ఎత్తులో ఉంటాయి.

ప్రతి ఆలయంలో సీతమ్మవారు, రాములవారి ఎడమ పక్కన ఉంటుంది. ఈ ఆలయ గర్భాలయంలో మాత్రం అమ్మవారు, స్వామివారికి కుడి పక్కన ఉంటుంది. ఇలా దర్శించడం వల్ల భక్తులు  సకల సంపదలు మరియు మోక్షం పొందుతారు.

మాములుగా కోనేరు ఆలయానికి ఉత్తర పక్కన ఉంటుంది. ఈ ఆలయంలో మాత్రం దక్షిణ పక్కన ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు కూడా దక్షిణాది సంప్రదాయంలో జరుగుతాయి. 

ఈ ఆలయంలో ఇంకా చతుర్భుజ లక్ష్మి అమ్మవారు, నరసింహ స్వామి వారు, ఆండాళ్ అమ్మవారు దర్శనమిస్తారు. 

ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.



ముఖ్యమైన పండుగలు :

బ్రహ్మోత్సవాలు
శ్రీ రామనవమి
దసరా 
నరసింహ జయంతి
వైకుంఠ ఏకాదశి
హనుమాన్ జయంతి

ఆలయ  వేళలు :

ఉదయం06.00 నుండి రాత్రి 08.00 వరకు. 

ఎలా చేరుకోవాలి :

నెల్లూరు నుండి 16 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం -  09 కి.మీ దూరంలో 
వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం -13
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం నెల్లూరు -16
శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం నెల్లూరు -16
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నెల్లూరు - 17 కి.మీ దూరంలో.

Post a Comment

0 Comments