మాఘ మాసం హిందూ కేలండర్ ప్రకారం 11వ  నెల. మాఘ మాసం అంటే సంస్కృతం లో పాపాలను హరించే మాసం అని అర్ధం. 

శివకేశవులిద్దరికి ప్రీతికరమైనది మాఘమాసం. పల్లకి ఆకారంలో వుండే అయిదు నక్షత్రాల మండలం ముఖ నక్షత్రం. అటువంటి  ముఖ నక్షత్రంలో పౌర్ణమి తిధినాడు పూర్ణకళలతో చంద్రుడు ఉంటాడు కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చింది. 



మాఘమాసంలో సూర్యుడు  కుంభ రాశిలో సంచరిస్తాడు. అధిష్ఠాన దేవత వినాయకుడు, ఈ మాసంలో వినాయక ఆరాధన సర్వవిఘ్ననాశిని.సూర్యుని కిరణాలూ నేలపై జలాలను తేజోమయంగా మార్చేది మాఘమాసంలోనే. ఈ మాసంలో చేసే నది, సముద్ర స్నానాలు సర్వపాపహరణాలు, ముక్తి ప్రదాయకాలు.

కార్తీక మాసం లో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందొ, మాఘ మాసం లో నది లేదా సముద్ర స్నానాలకు అంత ప్రాధాన్యం వుంది.

ఈ నెలలో చేసే అరుణోదయ స్నానం సంపూర్ణ ఆరోగ్యాన్ని, తేజస్సును కలుగచేస్తుంది. 

ఈ మాసం లో నే వసంత ఋతువు  మొదలు అవుతుంది కాబట్టి ప్రకృతి కొత్త అందాల తో ముస్తాబు అవుతుంది.

పవిత్ర తీర్థమైన శ్రీ కాళహస్తి స్వర్ణ ముఖి నది, రామేశ్వరం సేతు సంగమం, ప్రయాగ  త్రివేణి సంగమంలో, ఇతర పవిత్ర నదులలో చేసే మాఘస్నానాలు పుణ్యబలంతో పాటు శక్తీ చైతన్యాన్ని కలుగచేస్తాయి. 

ఎకడైన గంగానదిలో స్నానం చేస్తే అది కురుక్షేత్ర సమానం అవుతుంది. అలాగే వింధ్యవాసినిలో  చేస్తే పదిరెట్లు, కాశీలో చేస్తే నూరురెట్లు పుణ్యం కలుగుతుంది అంటారు.

ఈ మాసంలో తిలాదానం, సాలిగ్రామం, వేణి దానం శుభప్రదం.

ఈ మాసంలో శుద్ధ తదియ శివ జగదంబకు ప్రీతికరం, ఆ రోజున లవణము, బెల్లం దానం చేయాలి.

శుద్ధ చతుర్థి: శ్రాధ కర్మలకు శుభమైనది. అందుకే దీనిని తిలచతుర్థి అని అంటారు. ఈ రోజు ఒకపూట భోజనం చేసి తిలలతో శివుని పూజిస్తే సంపదలు కలుగుతాయి. 

శుద్ధ పంచమి : మదన పంచమిగాను, శ్రీ పంచమిగాను ప్రసిద్ధి చెందిన రోజు ఇది. తెల్లని ఫుష్పలతో శ్రీ మహాలక్ష్మిని, సరస్వతి దేవి ఆరాధించాలి.

శుద్ధ సప్తమి : రథసప్తమిగా లోకప్రసిద్ధి.సూర్య జయంతిగా వ్యవహరిస్తారు. జన్మజన్మల నుంచి చేసిన పాపాలు నశింపచేసే శక్తి ఈ తిధి ఉంది అని శాస్త్రం. ఈ రోజు ఆచరించే సముద్ర స్నానం శ్రేష్టం.

శుద్ధ అష్టమి : భీష్మ అష్టమి రోజు చేసే తిలతర్పణం వాళ్ళ చక్కటి సంతానం కలుగుతుంది.

శుద్ధ ఏకాదశి : ఈ రోజు భీష్మ పంచక వ్రతం చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. త్రిపద్మ వ్రతం చేస్తే సుఖ జీవనం కలుగుతుంది. 

శుద్ధ ద్వాదశి : వరహాద్వాదశిగా పిలిచే ఈ పర్వదినం నాడు విష్ణు ఆరాధన చేయడం మంచిది.

శుద్ధ త్రయోదశి : వరాహ వ్రతకల్పము ఆచరించడం వల్ల శుభం కలుగుతుంది.

పౌర్ణమి : ఈ రోజు నువ్వులు, వస్త్రం, పాత్రలను దానం చేయాలి.

మాఘ బహుళ ద్వాదశిని తిల ద్వాదశి అంటారు. ఇది శివకేశవులకు పితృ దేవతలకు ప్రీతికరమైన తిధి. తిలలతో స్నానం చేసి శ్రీహరిని అర్చించి తర్పణాదులు చేస్తే పుణ్యలోక  ప్రాప్తి కలుగుతుంది. 

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు పుష్కర స్నానం, రుద్రాభిషేకం, బిల్వార్చన విశేష పుణ్యం కలుగచేస్తాయి.

మహాపాతకాలను నాసిపంచేసే మాసంలో సోమవారంతో కూడిన చతుర్దశి ఉత్తమ ప్రదాయని. శివనామ స్మరణ ముక్తిప్రదాయని.

ఈ మాసం లో నే వసంత ఋతువు  మొదలు అవుతుంది కాబట్టి ప్రకృతి కొత్త అందాల తో ముస్తాబు అవుతుంది.

2022 తేదీలు : ఫిబ్రవరి 02 నుండి మార్చి 02 వరకు