- శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు.
- ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భావిషోత్తర పురాణంలో వివరించాడు
- దీనికి లలిత ఏకాదశి అని కూడా పేరు
- ఈ రోజు ఉపవాసం వుండి, విష్ణువును పూజించి, పగలు హరినామ సంకీర్తనతోను, రాత్రి జాగరణతో గడిపి, మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మళ్లీ విష్ణు పూజ చేయాలి.
- పూర్వం మహాజిత్తు అనే రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, సంతానాన్ని పొందాడు అని పురాణ కధనం.
- ఈ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది.
- ఈ ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు.
- ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జనాల్లో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్దామనికి చేరుకుంటాడు.
ఏకాదశి మహిమ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2021 : ఆగష్టు 18.
0 Comments