• ఆషాడ నవరాత్రులను వారాహి నవరాత్రులు అని పిలుస్తారు.ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు జరుపుకుంటారు. 
  • ఈ నవరాత్రులను శాకాంబరీ లేదా గాయత్రీ నవరాత్రులు అని కూడా అంటారు. ఆషాడ నవరాత్రులను గుప్త నవరాత్రులుగా వ్యవహరిస్తారు, ఎందుకు అంటే చాలామందికి ఈ నవరాత్రుల గురించి తెలియదు.
  • ఉత్తరభారతదేశంలో ఈ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
  • ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు పూర్తిగా సాత్విక ఆహారం స్వీకరిస్తారు.
  • కొంత మంది ఉపవాసాలు కూడా ఉంటారు.
  • ఈ రోజులలో దుర్గ సప్తస్తతి, దేవి మహత్యం, దేవి భాగవతం పారాయణ చేస్తారు.
  • ఈ నవరాత్రులను ఆచరించడం వల్ల జీవితంలో సమస్యలు తొలగి శాంతి చేకూరుతుంది.
2022 : ఆషాడ నవరాత్రులు జూన్  30 నుండి జులై 08 వరకు