- భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి.
- అనంత స్వరూపుడైన నారాయణుడు పూజించబడే ఈ వ్రతానికే అనంత వ్రతమని పేరు.
- ఈ వ్రతంలో ముందుగా నదినుండి కాని, చెరువునుండి కాని, బావినుండి కాని కలశంలో జలాన్ని తేవాలి.
- తరువాత పీటపై పదునాలుగు పడగల ఆదిశేషుని ముగ్గుతో తీర్చిదిద్ది దానిపై ఈ జలకలశాన్ని వుంచి అనంతుని పూజించాలి.
- పూజలో మొగలి రేకులను, తులసీదళాలను వినియోగించాలి.
- పూజలో అనంతునితోపాటు తోరములను పూజించి, పూజానంతరం భర్త భార్య ఎడమ చేతికి భార్య భర్త కుడిచేతికి తోరమును కట్టాలి.
- “అనంత తోర"గా పిలవబడే ఈ తొర సంవత్సరంపాటు అన్ని విధాలుగా రక్షగా వుంటుందని చెబుతారు.
- ఈ తోర, పధ్నాలుగు పోచలను, పధ్నాలుగు ముడులను కలిగివుండాలి.
- ఈ వ్రతంలో ధరించిన తోరాన్ని సంవత్సరం పాటు అంటే మరుసటి సంవత్సరంలో వ్రతాన్ని ఆచరించేంతవరకు ధరించి వుండాలని చెప్పబడింది.
- అయితే ఈ విధంగా సంవత్సరం పాటు తోరాన్ని ధరించి వుండటం కష్టం కాబట్టి, వ్రతం నాటి నుండి ఐదురోజులపాటు తోరాన్ని ధరించి, తరువాత దాన్ని జాగ్రత్తగా భద్రపరచి తరువాతి సంవత్సరంలో వ్రతాన్ని ఆచరించే ముందురోజున తిరిగి ధరించి వ్రతం నాడు పాతతోరాన్ని తీసివేసి, కొత్త తోరాన్ని కట్టుకోవచ్చు.
- పాతతోరాన్ని విప్పిన తరువాత కూడా ఎంతో జాగ్రత్తగా వుంచాలి.
- ఈ వ్రతాన్ని చేయడం వల్ల దారిద్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.
2021 తేదీ : సెప్టెంబర్ 19.
0 Comments