మహాలక్ష్మి అమ్మవారు తన అంశలతో చాల సార్లు అవతరించింది. అందులోని ఒక్కక్క మనువు కాలంలో ఒక్కక్క విధంగా అవతరించింది.


  • స్వాయంభువ మన్వంతరంలో భృగు మహర్షికి కూతురుగా జన్మించి భార్గవిగా కీర్తి పొందింది.
  • స్వారోచిషంలో అగ్నిగా నుండి పుట్టి జ్వాలాముఖిగా, ద్రౌపదిగా పేరు పొందింది.
  • ఉత్తమ మన్వంతరంలో జలరాశి నుండి పుట్టి  కమలగా ఖ్యాతి వహించింది 
  • తామస మనువు కాలంలో భూమి నుండి పుట్టి సీతగా, భూమిజా లక్ష్మీగా ప్రసిద్ధి కెక్కింది 
  • రైవత మనువు కాలంలో మారేడు చెట్టు నుండి ఉద్బవించి బిల్వాజ, బిల్వాప్రియ అయింది
  • చాక్షుషంలో సహస్రదళ పద్మం నుండి పుట్టి 'పద్మజ'గా యశస్సు ధరించింది.
  • ప్రస్తుత వైవస్వత మనువు కాలంలో పాలసముద్రం నుండి పుట్టి, 'క్షీర సాగర కన్య'గా పేరు తెచ్చుకుంది.


ఇంకా రాబోయే ఏడుగురు మనువుల కాలంలో మరో ఏడు సార్లు అవతరించబోతుంది.