వినాయకుడు అనేపదానికి 'అణచువాడు' అని అర్ధం అంటే విఘ్నాలను అణచి వేయనట్టి దైవమని అర్థంచేసుకోవాలి. వినాయకునికి కావలసిన ఉదారత, ఉష్ణలత, విద్య, విజ్ఞానం, నేర్పు, విజ్ఞత, వివేకం, విచక్షణ, చతురత మొదలైన విశిష్ట లక్షణాలు గల దైవమే వినాయకుడు. ఆకృతిని బట్టి కొన్ని పేర్లు, ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈదైవం గణాలకు నాయకుడు.
- వినాయకుడు తన భక్తులను త్వరగా అనుగ్రహించి, సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు.
- వినాయకుడు సస్యకారకుడు. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించిన అనంతరం, పొలాల్లో ఉంచితే పొలాలు సస్యశ్యామలమవుతాయని ప్రతీతి.
- గణనాధుడు సఫలత్వ శక్తికి అధిష్ఠానదేవత. కనుకనే తొలిపూజలందే వేల్పుగా గుర్తించారు. అలా చేయడం వల్ల తలపెట్టిన కార్యాలు ఫలవంతమై సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు.
- గణనాధునికి కొబ్బరి నూనెతో దీపారాధన శ్రేష్ఠం
- వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ల, లడ్లు, చెరుకుగడలు, అరటిపండ్లు, నారికేళ (కొబ్బరి) ఫలాలు, మాదీఫలాలు, గారెలు, అప్పములు ప్రీతికరమైనవి.
0 Comments