శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 2 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.ఆగస్టు 2వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

వాహన సేవలు 

ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సింహవాహనం

ఆగస్టు 4న సాయంత్రం భూత వాహనం

ఆగస్టు 5న సాయంత్రం శేష వాహనం

ఆగస్టు 6న రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు.

ఆగస్టు 7న సాయంత్రం గజవాహనం

ఆగస్టు 8న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు కల్యాణోత్సవం 

ఆగస్టు 9 న సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌సంతోత్స‌వం, రాత్రి 7 గంట‌ల‌కు అశ్వవాహనం

ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, సాయంత్రం 6 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.