సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలి.
సెప్టెంబరు 26న అంకురార్పణ. అదేవిధంగా, సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.
తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ. మిగతా రోజుల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు. ఆర్జిత సేవలు, శ్రీవాణి, విఐపి బ్రేక్ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.
పెరటాసి మాసం. రెండో శనివారం నాడు గరుడసేవ రావడంతో రద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు .
భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూల బఫర్ స్టాక్.
అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం.
3,500 మంది శ్రీవారి సేవకులు
ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా తగినన్ని బస్సులు. గరుడసేవ రోజున ఎక్కువ బస్సులు.
తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్లలో గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకల నిషేధం. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ .
0 Comments