నర్మదా జయంతిని మాఘ మాసంలో జరుపుకుంటారు. మాఘ మాసం లో ఏడవ రోజు అనగా శుక్ల పక్ష  సప్తమి రోజు నర్మదా నది భూమి మీద ఆవిర్భవించింది. అదే రోజు రథ సప్తమి పండుగ కూడా .

నర్మదా నది మధ్యప్రదేశ్ లోని అమరకాండక్ లో పుట్టి అక్కడ నుండి పశ్చిమ దిక్కున ప్రవహించి మహారాష్ట్రా , గుజరాత్ మీదగా అరేబియన్ సముద్రం లో కలుస్తుంది.  రాజస్థాన్ , గుజరాత్ , మధ్యప్రదేశ్,  మహారాష్ట్ర ప్రాంతాలలో నర్మదా జయంతిని బాగా జరుపుకుంటారు.  అమరుకంటక్ , ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. అక్కడ నర్మదానదిలో  పవిత్ర స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు .

2021 : 19 ఫిబ్రవరి.