• మాఘమాసంలో వచ్చే అయిదో తిధి వసంత పంచమి. 
  • సరస్వతి అనే పదం నుంచి సారస్వతమనే మాట పుట్టింది. 
  • మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అనే పేరులతో వ్యవహరిస్తారు.
  • మాఘమాసం నుండి ఐదు మాసాలపాటు అన్ని శుభకార్యాలు మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక మాఘ మాసమే వసంత రుతు శోభలకు ఆరంభ మాసం.
  • మాఘమాసంలో తొలిగా చదువుల తల్లి సరస్వతి దేవిని పూజించాలి.
  • శ్రీ పంచమి నాడు ఆలయాలలో పిల్లలకు అక్షరాబ్యాసం చేస్తారు.
  • సరస్వతి మాతతో పాటు వినాయకుడిని, భూదేవి, విష్ణువు, శివుడు, సూర్యుడిని కూడా శ్రీ పంచమి రోజు పూజిస్తారు.
  • బృహస్పతి దేవతలకు గురువు. విద్యాసంపద గల్ల బృహస్పతి కూడా విద్యాసిద్ధి కోసం సరస్వతి అమ్మవారిని ఆశ్రయించాడు.
  • ఆదిశేషుడు కూడా సరస్వతి దేవిని ఉపాసించి భూదేవికి జ్ఞానబోధ చేయగలిగాడు అని బ్రహ్మపురాణంలో ఉంది.
  • ప్రకృతి మూడో రూపమైన శ్రీ మహాసరస్వతి పరబ్రహ్మ నుండి అవిర్భించింది.
  • మాట, బుద్ధి, విద్యకు ఆమె అధిదేవత .
  • శ్రావణ పౌర్ణమి రోజు వేదం అధ్యాయం ప్రారంభించి, మాఘ శుద్ధ పంచమి తిధి రోజు పరిసమాప్తి చేసే ఆచారం ఉంది.
  • మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, స్కంద పురాణం, బ్రహ్మ పురాణంలో అమ్మవారి వైభవం వర్ణితమైనది.


2021  : ఫిబ్రవరి   16.