Ad Code

Responsive Advertisement

క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి

దీపావళి అమావాస్య తరువాత కార్తీక మాసంలో పన్నెండో రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీనిని చిలుకు ద్వాదశి అని  లేదా బృందావన ద్వాదశి అని లేదా యోగిని ద్వాదశి అని కూడా పిలుస్తారు. తులసి అమ్మవారిని, విష్ణు భగవానుడికి చాల పవిత్రమైన రోజు. తులసి మరియు ఉసిరి చెట్టు ను పూజిస్తారు.




  • ఉత్తాన ఏకాదశి నాడు యోగనిద్ర విరమించిన విష్ణువు క్షీరాబ్ది ద్వాదశికి తులసి బృందావనంకి విచ్చేస్తాడు.
  • క్షీరసాగరాన్ని చిలికింది కూడా ఈ రోజే అని చెబుతారు.
  • లక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను, విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును ఉంచి పూజించవచ్చు.
  • ద్వాదశి  రోజు సాయంకాలం తులసి కోట వద్ద ముగ్గులతో అలంకరించి పసుపు రాసి కల్యాణ తిలకం దిద్దాలి.
  • తులసి కోట వద్ద దీపారాధన చేయాలి.
  • చాల మంది ఈ రోజు 360  వత్తులు వెలిగిస్తారు.
  • తులసి మాత అష్టోత్తర శత నామావళిని చదివి పూజించాలి, తరువాత నివేదన సమర్పించి హారతి ఇవాలి.
  •  క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చదువుకోవాలి.
  • ఈ వ్రతం ఆచరించిన వారికీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.
  • సిరిసంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయి.
2022 తేదీ : నవంబర్ 05.

Post a Comment

0 Comments