- పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు.
- కాకినాడ నగరం నుంచి యానాం వెళ్ళేదారిలో జగన్నాధపురం వంతెనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది.
- అక్కడే గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైనా తులాభాగ్య సముద్రంలో కలుస్తుంది.
- తులాభాగ్య మహర్షి తీసుకువచ్చిన ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య.
- సప్తసాగర యాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు.
- పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు.
- గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు.
- మాఘ పౌర్ణమి రోజు జరిగే అంతర్వేది తీర్థం ముందే చొల్లంగి తీర్థం నిర్వహిస్తారు.
- బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో. రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడింది అంటారు.
- ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు అని చెబుతారు.
- చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత సంగమేశ్వర దేవస్థానం ఉంది.
- అన్ని తీర్థాలలోను స్నానం చేసే భక్తులతో చొల్లంగి తీర్థం కళకళలాడుతుంది.
2020 : ఫిబ్రవరి 11.
0 Comments