శివదీక్షను 41 రోజులు కొనసాగేలా ఆచరిస్తారు. మాఘమాసంలో దీక్షను ప్రారంభించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పూర్ణాహుతి తో ముగిస్తారు.
శ్రీరాముడు శ్రీరామలింగేశ్వరుని దీక్షగా పూజించాడు.శ్రీ కృష్ణుడు ఉపమన్యువు ద్వారా శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్యదీక్షను స్వీకరించి తమ జన్మలని చరితార్థం చేసుకున్నారు అని పురాణ, ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతిదేవి.
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు , శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప మొదలు పర్వతుడు, భక్త సిరియాళుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు పౌరాణిక ఆధారాల ఉన్నాయి.
కార్తీకేయుడు కూడా శివదీక్షను పూని దేవతసైన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది.

నియమాలు
- శివదీక్షను స్వీకరించినవారు స్వయంగా శివభావన కలిగి నిరాడంబరులై చందన వర్ణం(గోధుమవర్ణం) గల వస్త్రాలను ధరించాలి.
- సూర్యోదయ, మధ్యాహన, సాయంకాల సమయంలో పూజను ఆచరించాలి.
- వీలైనంతగా మౌనంగా ఉండాలి.
- సూర్యోదయ, సూర్యాస్తమయలకు పూర్వమే చన్నీటి స్నానం ఆచరించాలి.
- అష్టోత్తర శతనామ పూజలను చేసేందుకు సాధ్యపడని స్వాములు బిల్వాష్టకంతో పూజించి లింగాష్టకంతో పఠించి పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- పదేళ్లలోపు స్త్రీలు, రుతుక్రమం లేనివారు, 60 ఏళ్ళ వయస్సు వారు దీక్షను ఆచరించవచ్చు.
- మాట్లాడే ముందు ప్రతి వ్యక్తిని శివ లేదా స్వామి అని సంబోధించాలి.
- ఒక్కపూట భోజనమే చేయాలి. నేల పై పడుకోవాలి.
దీక్షలో చేయకూడనివి
- క్షౌరం చేసుకోకూడదు
- గోళ్లు తీయడం చేయద్దు
- ధూమపానం, మద్యపానం చేయద్దు
- మాంసాహారం తినరాదు
- ఎక్కువగా మాట్లాడరాదు
- దీక్ష కాలాం పూర్తిగా పాదరక్షలు ధరించరాదు
- పగటి నిద్రకూడదు
- పరుషంగా మాట్లాడరాదు.
- కామక్రోధ వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
0 Comments