Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం - అంతర్వేది


తూర్పు గోదావరి జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది కూడా ఒకటి. దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి. ఈ క్షేత్రంలో మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.ఈ పుణ్యతీర్థంలో స్వామి వారు భక్తుల కోర్కెలు తీరుస్తారనే ప్రస్ధానం పురాణాలలో కూడా ఉంది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు.

స్థలపురాణం.

కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొంటూ  ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేదిని గురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు.

నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

ఆలయ వేళలు : ఉదయం 6.00  నుండి రాత్రి 7.30  వరకు 

నిజరూప దర్శనం - ఉదయం 6.00 నుండి 8.00 వరకు 
అభిషేకం - ఉదయం 8.00 నుండి 9.30  వరకు 

ఎలా వెళ్ళాలి :

భీమవరం నుండి 47  కి.మీ
పాలకొల్లు నుండి 28 కి.మీ
నర్సాపూర్ నుండి 20  కి.మీ

దర్శించవలసిన ఆలయాలు :

నరసాపూర్ శ్రీ ఆదికేశవ ఆలయం - 21 కి.మీ
రాజోలు శ్రీ భక్త అంజనేయ స్వామి ఆలయం - 27 కి.మీ
కడలి శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం - 30 కి.మీ
అబ్బిరాజుపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం - 36 కి.మీ
ముత్యాలపల్లి శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయం - 36 కి.మీ 

Post a Comment

0 Comments