శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి అనే పట్టణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మి సమేతంగా యోగసినుడై యోగానంద నరసింహునిగా కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
- ఈ ఆలయాన్ని ఏకలోక స్వర్గ దేవత నిలయంగా పిలుస్తారు.
- నవనారసింహ ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి.
- ఈ ఆలయాన్ని 17 వ శతాబ్దంలో పునర్నిర్మించారు
- ఈ ఆలయాన్ని త్రిమూర్తి క్షేత్రంగా కూడా పిలుస్తారు
- ఇదే ఆలయంలో ఉన్న ఉగ్రనరసింహ స్వామిని కూడా భక్తులు దర్శించుకుంటారు.
- ఈ ఆలయానికి అతి సమీపంలో రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి దీనికి రామలింగేశ్వర లింగం అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారికీ పునర్జన్మ ఉండదని చెబుతారు.
- ఈ ఆలయంలో వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
- ఇక్కడి భక్తులు యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది.
పురాణాల ప్రకారం హిరణ్యకశపుడిని సంహరించి నరసింహ స్వామిని దేవతలు శాంతి వహించమని కోరగా, స్వామివారు యోగముద్రలో ఇక్కడ కొలువైయ్యారు.
ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆంజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
ఆలయ వేళలు :
ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 వరకు
సుప్రభాత సేవ - 5.00 నుండి 7.00
అభిషేకం - 6.00 నుండి 8.00
నిత్య హోమం - 10.00 నుండి 11.00
నిత్య కళ్యాణం - 11.00 నుండి 12.00
మహార్చన దర్శనం - 12.00 నుండి 2.00
ఆలయం మూత - 2.00 నుండి 4.00
మళ్ళీ దర్శనం - 4.00 నుండి 5.00
నిత్య సేవ - 5.00 నుండి 5.30
దర్శనం - 5.30 నుండి 7.00
నివేదన, హారతి - 7.00 నుండి 7.15
దర్శనం - 7.15 నుండి 8.00
ఆలయ ద్వారాలు మూత - 8.00
ముఖ్యమైన పండుగలు :
నరసింహ జయంతి
బ్రహ్మోత్సవాలు
ముక్కోటి ఏకాదశి
కార్తీక పౌర్ణమి
వైకుంఠ ఏకాదశి
ఎలా వెళ్ళాలి :
జగిత్యాల నుండి 30 కి.మీ
చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :
మంచిర్యాల గౌతమేశ్వర స్వామి ఆలయం - 44 కి.మీ
గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం - 12 కి.మీ
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం - 70 కి.మీ
0 Comments