శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు.
స్థలపురాణము
ముఖ్యమైన పండుగలు :
ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి, ఆశ్వయుజ శుద్ధ చతుర్ధశి రోజుల్లో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు.
ముక్కోటి ఏకాదశి
బ్రహ్మోత్సవాలు
ధనుర్మాస ఉత్సవాలు
ఆలయ వేళలు : ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి :
భీమవరం నుండి 16 కి.మీ
నరసాపూర్ నుండి 50 కి.మీ
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం - 16 కి.మీ
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం - 39 కి.మీ
ఆచంట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం - 57 కి.మీ
స్థలపురాణము
పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడనే బ్రాహ్మణుడుండే వాడు. అతను శ్రీవారి ఆలయంలో నాట్యంచేసే పద్మావతి అనే ఆమెను ప్రేమించి తనను పెండ్లాడమని కోరగా ఆమె తిరస్కరిస్తుంది. దానికి కోపగించిన శ్రీధరుడు ఆమెను శపిస్తాడు. దానికి కినుక వహించిన ఆమె కూడా శ్రీధరుడిని శపిస్తుంది. శాపవిమోచనము కొరకు ఆ ఇద్దరు శ్రీ వేంకటేశ్వరుని సేవిస్తారు. దాంతో ఆ దేవ దేవుడు కరుణించి పద్మావతికి తన పేరుతో నదిగా గోదావరి సమీపాన అవతరిస్తావని....... శ్రీధరునికి..... బ్రాహ్మణుడిగా జన్మించి అష్టకష్టాలు పడి శిష్యులతో పద్మావతీ నది తీరంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడని .... శాప విమోచన మార్గాలు చెపుతాడు. కొన్నాళ్లకు శ్రీధరుడు గోదావరి ప్రాంతాన పద్మావతీ నదీ తీరాన వేంకటేశుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాని ఆవిగ్రహం దొంగల పాలు కాగా, శ్రీవేంకటేశ్వరుడు... శ్రీధరుని కలలోకొచ్చి ... నదికి పశ్చిమాన ఉన్న అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్నానని చెప్పగా,... శ్రీధరుడు ఆ విగ్రహాన్ని తెచ్చి నదికి తూర్పు దిక్కున ప్రతిష్ఠించి పూజించాడు. అలా ఆ ఇరువురికి శాప విమోచనము కలుగుతుంది. శ్రీధరుడు ప్రతిష్ఠించిన విగ్రహము నడుము క్రింది భాగమంతా భూమిలో కూరుకు పోయి.... కాళ్లు కనబడకుండా ఉండేది. అందువలన ఆ క్షేత్రానికి కాళ్లకూరు అనే పేరు స్థిరపడి పోయింది.
ముఖ్యమైన పండుగలు :
ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి, ఆశ్వయుజ శుద్ధ చతుర్ధశి రోజుల్లో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు.
ముక్కోటి ఏకాదశి
బ్రహ్మోత్సవాలు
ధనుర్మాస ఉత్సవాలు
ఆలయ వేళలు : ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి :
భీమవరం నుండి 16 కి.మీ
నరసాపూర్ నుండి 50 కి.మీ
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం - 16 కి.మీ
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం - 39 కి.మీ
ఆచంట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం - 57 కి.మీ
0 Comments