తిరుమలలో శ్రీస్వామిపుష్కరిణికి వాయువ్యమూలలో తూర్పుముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఉంది.
శ్రీమహావిష్ణువు అదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడ నిలిచాడు.అందుకే తిరుమల వరాహక్షేత్రమైనది.
తరువాత వేంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి వచ్చి, తాను ఉండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు.
ఆ ఒప్పందానికి నియమంగా 'ప్రధమ దర్శనం , ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం వరాహస్వామివారికి, వేంకటేశ్వర స్వామి పత్రం రాసించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
ఇప్పటికి ఈ నియమం అమలులో ఉంది.
వరాహస్వామిని మొదట దర్శిస్తే వేంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు.తిరుమల క్షేత్ర సంప్రదాయం కూడా అదే.
వరాహస్వామిని తొలుత దర్శిస్తే భక్తుడు జ్ఞానమయకోశంలోకి ప్రవేశిస్తాడు.
శ్రీవరాహస్వామివారికి వైఖానసాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు, నివేదనలు జరపబడుతున్నాయి. వేంకటేశ్వర స్వామికి అంటే ముందుగానే శ్రీవరాహస్వామివారికి అన్నప్రసాదాలు నివేదింపబడుతాయి.
ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకం జరుగుతుంది.ప్రతి బ్రహ్మోత్సవం చివరిరోజు శ్రావణ నక్షత్రం రోజున చక్రస్నానం సందర్భంగా శ్రీదేవి,భూదేవి సమేతుడై శ్రీవెంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్ తో కూడా వేంచేస్తాడు, తిరుమంజనం తరువాత వరాహపుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది.
రథసప్తమి,ముక్కోటి ద్వాదశినాడు అభిషేకం జరిపి,పుష్కరిణిలో స్నానం చేయిస్తారు.
0 Comments