సర్వసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏమిచేయాలి ?

  • ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యానికి  కూడా మంచిది.
  • ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావడం లక్ష్మీ దేవికి ఇష్టం ఉండదు.
  • సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించేవారు, భుజించేవారు, పగటి పూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
  • శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన వారు.
  • చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు.
  • బద్దకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినే వారు, గురువులను, పెద్దలను అవమానించేవారు, అపరి శుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతినిద్రాలోలురు ఇంటి ముంగిట్లో లక్ష్మీదేవి కాలిడదు.
  • లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని వస్త్రాలను, పరిమళభరి తమైన పూలను అలంకరించి, ధూపదీప నైవేద్యాలను సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్టం.
  • బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదే విని కించపరిచినట్లే.అందుకే కాళ్ల పట్టీలు, మెట్టెలు వెండివి మాత్రమే ధరించాలి.
  • దేవీ భాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి .
  • లక్ష్మీదేవికి నివేదించే పిండివంటలను నూనెతో కాకుండా నేతితో చేయడం శ్రేయస్కరం .
  • లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి.
  • క్షమాగుణం, శాంత గుణం అనే రెండు గుణాలలో లక్ష్మీదేవి ఉంటుంది ఈ రెండు గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది.