Ad Code

Responsive Advertisement

శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం - నాగలాపురం

నాగలాపురం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం, తిరుపతికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు మరియు చెన్నైకి ఉత్తరాన 90 కిలోమీటర్లు దూరంలో ఉంది.



ఈ ఆలయంలో మత్స్య అవతారంలో స్వామివారు దర్శనం ఇస్తారు. ఇది విష్ణు భగవానుడి పది అవతారాలలో మొదటి అవతారం. ఇక్కడ స్వామి వారిని వేదనారాయణ స్వామిగా పూజిస్తారు.

పురాణాల ప్రకారం, సోమకుసుర అనే రాక్షస రాజు ఒకసారి 4 వేదాలను దొంగిలించి సముద్రంలో తన అదుపులో ఉంచుకుంటాడు . వేదాలు లేకుండా ప్రపంచం మొత్తం పనిచేయలేనందున సృష్టికర్త అయిన బ్రహ్మ ఆందోళన చెందుతాడు . బ్రహ్మ  వెళ్లి వేదాలను పరిరక్షించి , విశ్వాన్ని కాపాడమని విష్ణువును వేడుకుంటాడు.

విష్ణువు, మత్య్స అవతార రూపంలో  సముద్రంలోకి లోతుగా వెళ్లి సోమూకాసురుడితో పోరాడి . 4 వేదాలను తిరిగి తెచ్చి, బ్రహ్మకి సురక్షితంగా అప్పగిస్తాడు. వేదాలను కాపాడిన స్వామిగా వేదనారాయణ స్వామిగా కొలుస్తారు.

ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవితో స్వామి దర్శనం ఇస్తారు.



మార్చి నెలలో స్వామివారికి తెప్పోత్సవాలు వైభవముగా జరుగుతాయి.

మరో విశేషం ఏమిటి అంటే ఇక్కడ స్వామి వారికీ ప్రతి సంవత్సరం మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి.మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత.

ఆలయ వేళలు  :

ఉదయం 6.00 నుండి రాత్రి 8.00  వరకు 

ఎలా వెళ్ళాలి :

తిరుపతి నుండి 70 కి.మీ దూరం 

దర్శించవలసిన ఆలయాలు :

సురాటపల్లి శ్రీ పళ్ళికొండేశ్వర ఆలయం - 15 కి.మీ 

రామగిరి వాళేశ్వర స్వామి ఆలయం - 5 కి.మీ 

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం - 25 కి.మీ 

Post a Comment

0 Comments