Ad Code

Responsive Advertisement

శ్రీ మార్గబండేశ్వరర్ స్వామి వారి ఆలయం - విరించిపురం

 శ్రీ మార్గబండేశ్వరర్ స్వామి వారి ఆలయం విరింజిపురం గ్రామం, వెల్లూరు జిల్లా తమిళనాడు రాష్ట్రంలో వెలసింది. ఈ ఆలయం పలర్ నది ఒడ్డున ఉంది.





ఈ ఆలయంలో మహాశివుడు మార్గబండేశ్వరర్ స్వామిగా పూజలు అందుకొంటున్నాడు. ఇక్కడ అమ్మవారు మరగదంబికై. 


మార్గబండేశ్వరర్ అంటే మంచి మార్గంలో నడిపేవాడు అని అర్ధం. 


స్థల పురాణం ప్రకారం శివుడు, బ్రహ్మను భూలోకంలో విగ్రహ పూజ లేకుండా శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు శివ శర్మ అనే బ్రాహ్మణుడుగా పుట్టి స్వర్ణ గణపతిని పూజిస్తాడు. చిన్నవాడైన శివశర్మ శివలింగం పై భాగాన్ని అందుకోలేకపోతాడు. పూజకు మెచ్చిన శివుడు లింగాన్ని వంచి శివశర్మ చేత అభిషేకం చేయించుకుంటాడు. 


ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించారు. 


ఈ ఆలయ రాజగోపురం ఏడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి రెండు ద్వారాలు వున్నాయి. ఆలయం శిల్ప సౌందర్యంతో అలరారుతుంది. 



ఫిబ్రవరి - మార్చి మాసాలలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాకుతాయి. 

1008 చిన్న శివలింగాలతో చేసిన ఒక మహాశివలింగం ఈ ఆలయంలో ఉంది.

అరుణాచల పురాణం, శివ రహస్యం, కంచి పురాణాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది.


సంతానం కోసం ఆలయపుష్కరిణిలో స్నానాలు చేస్తారు.

వివాహం కోసం స్వామివారికి , అమ్మవారికి అభిషేకాలు చేస్తారు

కార్తీక మాసంలో ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు.

ఆలయ దక్షిణ ద్వారా భక్తులను అనుమతించరు, రాత్రి వేళలో మునులు, దేవతలు ఇక్కడ స్వామివారిని దక్షిణ ద్వారం ద్వారా వచ్చి పూజిస్తారు అని విశ్వాసం. 


సాంప్రదాయ దుస్తులతో ఆలయ దర్శనం చేయాలి.


ఆలయ వేళలు 


ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు 


సాయంత్రం 4.00  నుండి రాత్రి 8.00 వరకు 


ఎలా వెళ్ళాలి 


చెన్నై నుండి 150  కి.మీ 


వెల్లూరు నుండి 10  కి.మీ 


Post a Comment

0 Comments