Ad Code

Responsive Advertisement

శ్రీ శివ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - సైదాపేట, చెన్నై

 శ్రీ శివ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం సైదాపేట, చెన్నై నగరంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. 


ఈ ఆలయంలో సుబ్రమణ్యస్వామి వారితో పాటు వల్లి, దేవసేన అమ్మవారు దర్శనమిస్తారు. 


ఈ ఆలయ రాజా గోపురం అయిదు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. 


సుమారు 100 ఏళ్ళ క్రితం స్వామివారి నగలు దొంగిలించడానికి వచ్చిన దొంగకి, స్వామివారి విగ్రహం మీద చేయ వేయడంతో దొంగకి కళ్ళు పోతాయి. ఈ విషయం జరిగిన తరువాత స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


300 ఏళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది.


మంగళ మరియు శుక్రవారాలలో అంగారక గ్రహానికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి కోరికలు కోరుకుంటారు. అన్నాతమ్ముల మధ్య గొడవలు, వివాహంలో ఆటంకాలు కలవారు ఈ స్వామిని పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది.


ఆలయ వేళలు :

ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు 

సాయంత్రం 4.00  నుండి రాత్రి 9.00 వరకు 


ఎలా వెళ్ళాలి 

చెన్నై నగరం నుండి సులభంగా చేరుకోవచ్చు 

Post a Comment

0 Comments