Ad Code

Responsive Advertisement

భోగ భోగ్యాల భోగి

నాలుగు రోజుల సంక్రాతి పండుగకు సంబంధించి మొదటి రోజు భోగి.


  • ధనుర్మాసంలో చివరి రోజు భోగి.
  • భోగినాడు తలంటు స్నానము చేయాలి, ఈ స్నానంతో భోగి పీడ వదిలింది అని సంతోషించాలి.
  • ఇంటిని మంగళ తోరణాలతో , గడపను పసుపుకుంకుమలతో అలంకరించాలి.
  • తెల్లవారకముందే వేసిన భోగిమంటలు చుట్టూ ఇంటిళ్లిపాది చేరి చలి కాచుకోవడం, స్నానం చేసి, కొత్త బట్టలు కట్టడం ఒక సరదా.
  • మధ్యాహన వేళ బొమ్మల కొలువు పెట్టాలి.
  • సూర్యాస్తమయం లోపల ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలకు భోగి పళ్లు పోయాలి.
  • భోగి నాడు సజ్జ రొట్టెలు తినడం ఆచారం, నువ్వులు అద్దిన సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండ ఉండాలి.
  • భోగినాడు శివునికి నేతితో అభిషేకం చేయడం మంచిది అని శివరహస్యం  అనే గ్రంధం చెపుతుంది.
  • గోదాదేవి రంగనాధుని ధనుర్మాసం ముపైరోజులు సేవించి ఆనాడే స్వామిని కళ్యాణం చేసుకుని స్వామిలో లీనమైంది అని వైష్ణవ గ్రంధాలూ వర్ణిస్తాయి.
  • ఆ రోజు శ్రీరంగ క్షేత్రంలో మహావైభవంగా గోదారంగనాధుల తిరుకల్యాణం నిర్వహిస్తారు.
  • కొన్ని వైష్ణవ ఆలయాలలో కూడా  గోదారంగనాధుల కళ్యాణం నిర్వహిస్తారు.
  • ఈ రోజు వస్త్రదానం చేస్తే మహాపుణ్యం అని విష్ణు ధర్మోత్తర పురాణం చెపుతుంది.
  • నువ్వులు దానం ఇస్తే రోగాలు నశిస్తాయి అని స్కంద పురాణం చెబుతుంది. 
  • భోగినుంచి సూర్యకిరణాలు సర్వ ఔషధాలను  పునర్ జీవింప చేసేవిగా మారుతాయి అని తైత్తరీయ వేదం వాక్కు. 
  • ఈ రోజు గుమ్మడికాయ దానం ఇస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి అని ధర్మప్రవృతి అనే గ్రంధం స్పష్టం చేస్తుంది. 
  • పూర్వకాలంలో భోగినాడు యజ్ఞాలు కూడా నిర్వహించేవారు. 



రాయలసీమ లో 

రాయలసీమ ప్రాంతాలలో భోగి మంటలు లేవు కానీ, భోగి నాడు అని కూరగాయలు కలిపి కలగూర అన్న పేరుతో ఒక వంటకం చేస్తారు. పసుపు రంగుల దుస్తులు ధరించడం మరో ఆచారం.
మహిళలు తప్పకుండ ఈ రోజు కొత్త గాజులు ధరిస్తారు.

తెలంగాణ లో 

భోగినోము పేరిట మట్టికుండలో నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు, జీడిపళ్లు, చిల్లర డబ్బులు వేసి యముణ్ణి చెల్లలు యమున నోచుకున్నట్టుగా ఆ మట్టి ముంతను మూసి వాయునాలుగా ఇవ్వడం ఆచారం.

మహారాష్ట్రలో భోగినాడు ఇంటికోడలు చుక్కలు ఉన్న నల్ల చీర ధరిస్తుంది, నువ్వులు బెల్లం ముక్కలను అందరు పంచుకుంటారు.

కర్ణాటకలో  భోగినాడు నువ్వులు, బెల్లం ముక్కలు , కొత్త బట్టలు చేతలో ఉంచి వాటిని వాయనంగా సువాసినులకు పంచిపెడతారు.  

2021 : జనవరి  13.

Post a Comment

0 Comments