Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - సింగోటం

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం సింగోటం గ్రామం, కొల్లాపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 


యాదగిరిగుట్ట తరువాత తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం ఇది. స్వామివారు ఇక్కడ లింగాకారంలో దర్శనమిస్తారు. 


ఈ ఆలయం దాదాపు 900 ఏళ్ళ క్రితం నిర్మించబడింది. 


స్థల పురాణం 


సింగోటం గ్రామంలోని ఒక పేద రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి శిల అడ్డుతగిలింది. దాని తొలగించి గట్టుపై ఉంచాడు ఆ రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టునుండి మాయమై మళ్ళీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు.


అనంతరం శిలారూపంలో వున్న శ్రీ నృసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి  ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా ఆయన గుర్తించలేదని అందువల్ల నీవు వెళ్ళి సూర్యోదయానికి  ముందే లింగాకారాన్ని తొలగించి పవిత్ర స్థలంలో ప్రతిష్టించమని ఆదేశించాడట. నిద్ర మేల్కొని వెంటనే ఆ లింగాన్ని ప్రతిష్టించాడు.


లింగాకారంలో వున్నా స్వామికి ప్రతి సోమా, శనివారాలలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంక్రాంతి పర్వదినం అనంతరం స్వామివారికి నెలరోజులపాటు తిరునాళ్లు జరుగుతుంది. 


ఆలయ వేళలు


ఉదయం 6.00 నుండి రాత్రి 7.00 వరకు 


ముఖ్యమైన పండుగలు


నరసింహ జయంతి 

కార్తీక మాసం 

మహాశివరాత్రి 

నరసింహ ద్వాదశి 


ఎలా వెళ్ళాలి


కొల్లాపూర్ నుండి 21 కి.మీ 

హైదరాబాద్ నుండి 140 కి.మీ 

వనపర్తి నుండి 31 కి.మీ 


Post a Comment

0 Comments