మనదేశంలోని పుణ్యనదులకు పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలు నిర్వహిస్తారు. గురుగ్రహ సంచారాన్ని అనుసరించి పుష్కరాల నిర్వహణ జరుగుతుంది. పుష్కరాల వలెనే నదులకు జరిపే మహోత్సవాల్లో కుంభమేళా ప్రసిద్ధమైనది. హరిద్వార్, నాసిక్, ప్రయాగ, ఉజ్జయిని క్షేత్రాల్లో ఈ కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి.
కుంభమేళా నిర్వహణకు ఒక పురాణగాథ ఉంది. దానిప్రకారం క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని రాక్షసులకు దక్కకుండా దాచిపెట్టే సమయంలో కలశం నుంచి నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. అవే కుంభమేళా నిర్వహించే ప్రదేశాలు.
హరిద్వార్ కుంభమేళా జనవరి 14 నుండి మే 26 వరకు జరుగుతుంది.
హరిద్వార్ లో గురుడు మకరంలోనూ, సూర్యుడు మేషంలో ఉన్నప్పుడు ఇక్కడ కుంభమేళా జరుగుతుంది.
ప్రతి క్షేత్రంలోనూ మూడు సంవత్సరాలకు ఓసారి సాధారణ కుంభమేళా నిర్వహిస్తారు
ఆరేళ్లకు ఒకసారి అర్థకుంభమేళా నిర్వహిస్తారు
పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణకుంభమేళా జరుగుతుంది.
పూర్ణకుంభమేళా తరువాత 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది.
ముఖ్యతేదిలు :
జనవరి 14 - మకర సంక్రాంతి
జనవరి 28 - పుష్య పూర్ణిమ
ఫిబ్రవరి 11 - మౌని అమావాస్య
ఫిబ్రవరి 16 - వసంత పంచమి
ఫిబ్రవరి 27 - మాఘ పూర్ణిమ
మార్చి 11 - మహా శివరాత్రి
మార్చి 13 - ఫాల్గుణ అమావాస్య
మార్చి 28 - ఫాల్గుణ పూర్ణిమ
ఏప్రిల్ 11 - చైత్ర అమావాస్య
ఏప్రిల్ 12 - సోమవతి అమావాస్య
ఏప్రిల్ 13 - ఉగాది
ఏప్రిల్ 14 - మేష సంక్రాంతి
ఏప్రిల్ 21 - శ్రీ రామనవమి
ఏప్రిల్ 27 - చైత్ర పూర్ణిమ
మే 11 - వైశాఖ అమావాస్య
మే 26 - వైశాఖ పూర్ణిమ
దర్శించవలసిన ఆలయాలు
హరికి పౌరి
మానస దేవి ఆలయం
మాయ దేవి ఆలయం
చండి దేవి ఆలయం
దక్షేశ్వర మహాదేవ్ ఆలయం
0 Comments