Ad Code

Responsive Advertisement

కార్తీక పూర్ణిమ రోజు ఏమి చేయాలి ?

కార్తీక పూర్ణిమ ని త్రిపుర పూర్ణిమ లేదా దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణు మత్స్య అవతారం లో అవతరించింది ఈ రోజే. పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది ఈ రోజే. 



ఈ రోజు చాల పరమ పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు, రోజు అంత ఉపవాసం వుంటారు, అంతే కాకుండా నది స్నానం  చేయడం, రాత్రి అంత దీపాలు వెలిగించడం ఇంకా దానాలు చేయడం ఈ రోజు విశేషాలు.ఇలా చేయడం వాళ్ళ అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది అని భావిస్తారు.

ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక లో శివలింగానికి మహా జలాభిషేకం నిర్వహిస్తారు.

ఈ రోజు పాయసం చేసి శివునికి అర్పించి దాని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనసు ప్రశాంతం గా ఉంటుంది, జీవితంలో అని శుభాలు జరుగుతాయి.

ఈ రోజు చంద్రుని తదేకంగా చూడడం వల్ల కళ్ళు ప్రశాంతం గా ఉంటాయి.

ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నాలుగు దిక్కులు నాలుగు దీపాలు వెలిగించడం వల్ల మంచి ఫలితం  ఉంటుంది.

మహా మృతుంజయ మంత్రాన్ని108 సార్లు  జపించాలి.

Post a Comment

0 Comments