Ad Code

Responsive Advertisement

శ్రీహరి స్నానఫలం (నారద పురాణం )



  • జగన్నాథుడైన నారాయణుడికి ద్వాదశీ తిథిలోకానీ, పూర్ణిమా తిథినాడు గానీ పాలతో స్నానం చేయిస్తే పదివేల తరాలు విష్ణులోక నివాసాన్ని పొందుతారు. 
  • ద్వాదశినాడు ఒక్క గరిట నెయ్యితో (ఆవునెయ్యి) శ్రీహరి ప్రతిమని అభిషేకిస్తే కోటి తరాలవారు శ్రీహరి సాయుజ్యాన్ని పొందుతారు. 
  • ఏకాదశీతిథినాడు పంచామృతాలతో శ్రీహరికి స్నానం చేయిస్తే పది లక్షల తరాల వారికి సాయుజ్యం లభిస్తుంది. 
  • ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమా తిథుల్లో కొబ్బరినీళ్ళతో శ్రీహరి ప్రతిమకి స్నానం చేయిస్తే పదిజన్మల్లో చేసిన పాపం తొలగిపోయి రెండు వందల తరాల వారు శ్రీహరితో కలిసి ఆనందిస్తారు. 
  • చెఱుకు రసంతో మహావిష్ణువుని అభిషేకిస్తే లక్షతరాలు విష్ణులోక నివాసం దొరుకుతుంది. పుష్పోదకం లేక గంధోదకంలో స్నానం చేయించినా అదే ఫలితం లభిస్తుంది.
  • సూర్య సంక్రమణం వున్న రోజు పాలతో శ్రీహరి ప్రతిమని అభిషేకిస్తే ఇరవై ఒక్క తరాల వారు విష్ణులోకంలో నివసిస్తారు. 
  • శుద్ధ చతుర్దశి, అష్టమి, పూర్ణిమ, ఏకాదశి, ద్వాదశి, పంచమి తిథులలో గానీ, ఆదివారం, సోమవారం, సూర్యగ్రహణం, మన్వంతరాల ప్రారంభ సమయాలలోగానీ, సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు గానీ, బుధుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నప్పుడు గానీ, అలాగే శని-రోహిణీలో కుజుడు అశ్వినిలో, శుక్రుడు మృగశిరలో, బుధుడు-రేవతిలో, సూర్యుడు-శ్రవణంలో, చంద్రుడు -శ్రవణంలో, బృహస్పతి-హస్తలో ఉన్నప్పుడు అదే విధంగా బుధాష్టమిలో బుధాషాఢలో ఇతర పుణ్యదినాలలో శ్రీహరిని పాలతో లేదా పంచామృతాలతో (పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార)స్నానం చేయించటం అత్యంత పుణ్యప్రదం.


ఆవిధంగా చేసినవారు సకలపాపాలనుంచీ విముక్తులై ఇరవై ఒక్క తరాలు విష్ణులోకంలో నివసించి  తరువాత యోగులకు కూడా దుర్లభమైన మోక్షాన్ని పొందుతారు.

Post a Comment

0 Comments