- కృష్ణపక్ష చతుర్దశీ తిథి మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజు శివుణ్ణి పాలతో అభిషేకిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
- అష్టమినాడు కానీ, సోమవారం నాడు కానీ కొబ్బరినీళ్ళతో శివలింగానికి లేదా ప్రతిమకి అభిషేకం చేస్తే వారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది.
- శుక్లపక్ష చతుర్దశి, లేక అష్టమినాడు తేనె లేక నేయితో శివాభిషేకం చేస్తే శివసారూప్యం లభిస్తుంది.
- నువ్వుల నూనెతో శివుణ్ణి లేక శ్రీహరిని అభిషేకిస్తే ఏడు తరాలపాటు శివవిష్ణు సారూప్యం కలుగుతుంది.
- చెఱకురసంలో శివుణ్ణి అభిషేకిస్తే ఏడుతరాల వారు ఒక కల్పం పాటు శివలోకంలో నివసిస్తారు.
- ఉత్థానద్వాదశినాడు పాలతోకానీ, నేయితోకానీ శివాభిషేకం చేసినవాడు కోటి జన్మల్లో చేసిన పాపం నుంచి విముక్తుడై శివలోకాన్ని చేరుకుంటాడు.
0 Comments