Ad Code

Responsive Advertisement

నాగ పంచమి


  • శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తారు.
  • ఈరోజు  గరుడ పంచమిని కూడా జరుపుకుంటారు .
  • తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే యిది గరుడ పంచమి అయింది. 
  • అయితే ఈ రోజున జరిగే పూజంతా నాగ సంబంధమైంది కావడం విశేషం. ఈ కారణంగానే ఈ పర్వదినానికి నాగపంచమి అనే పేరే ప్రాచుర్యంలో ఉంది.
  • ఈ  రోజున ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవుపేడతో సర్పాలు వేసి ఇంట్లో బంగారంతో కాని, వెండితో కాని, కొయ్యతో కాని, మట్టితో కాని చేసిన నాగ ప్రతిమను పంచామృతాలతోను, లేత గరిక, దర్భ, సువాసనగల జాజి, సంపెంగలాంటి పూలు గంధం మొదలైన వాటితో పూజించాలి.
  • నాగపూజ వల్ల సర్పదోషాలు నశిస్తాయి.సర్పభయం ఉండదు 
  • కండ్లకు, చెవులకు సంబంధించిన వ్యాధులు కూడా రావని చెబుతారు.
  • కొన్ని చోట్ల నాగుల చవితి, నాగపంచమి రోజులలో భూమి దున్నటం లాంటి పనులు చేయరు.
ఈ రోజు ఏమి చేయాలి ?

ఈరోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్య పూజ పూర్తి చేయాలి.

ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమ గంధ, పుష్ప, అక్షతలతో పూజించి, దీపం, అగరొత్తులు వెలిగించి అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలు మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరించాలి.

పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించాలి నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు.

కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. 

2021 : ఆగష్టు  13. 

Post a Comment

0 Comments