వ్రతాలలో ఎంతో గొప్పది చాతుర్మాస్య వ్రతం. చాతుర్మాస్యం ప్రారంభం కాగానే సకలతీర్థాలు, దేవతలు, దివ్యస్థలాలు విష్ణుమూర్తి శరణు పొందుతున్నాయి. పవిత్రమైన ఈ చాతుర్మాస్యం ఆషాఢ పౌర్ణమినాడు ప్రారంభమవుతుంది. నాలుగు నెలలకి ముగుస్తుంది.
- చాతుర్మాస్యంలో శ్రీహరిని సేవించినవాడి జీవితం ఫలవంతంగా వుంటుంది.
- చాతుర్మాస్యంలో నదీ స్నానం చేసినవాడికి సిద్ధి లభిస్తుంది.
- నదుల్లో అవకాశం లేకపోతే చెరువులలో జలాశయాల్లో స్నానంచేసిన వారికి పాపనివారణ జరుగుతుంది.
- పుష్కరక్షేత్రం, ప్రయాగ లేదా ఏదో ఒక మహాతీర్థంలో స్నానం చేస్తే అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది.
- నర్మదానదిలో మూడురోజుల పాటు నియమంగా చాతుర్మాస్య స్నానాన్ని ఆచరిస్తే పాపాలన్నీ ఛిన్నాభిన్నమైపోతాయి.
- పవిత్రమైన గోదావరి నదిలో ఉదయంపూట, చాతుర్మాస్యకాలంలో, కనీసం పదిహేను రోజులు స్నానం చేయాలి. అలా చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
- చాతుర్మాస్యంలో నీళ్ళలో నువ్వులు లేక ఉసిరి రసం లేక బిల్వ పత్రాలు వేసి, ఆ నీళ్ళతో స్నానం చేస్తే వారు చేసిన ఘోరమైన పాపాలన్నీ నశిస్తాయి.
- చాతుర్మాస్యంలో గంగానదీ స్నానం ఎంతో పుణ్యప్రదం.
- చాతుర్మాస్యంలో నారాయణ క్షేత్రాల్లో ఉన్న తీర్థాల్లో స్నానం చేయాలి. తద్వారా శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.
- చాతుర్మాస్యంలో రాత్రిపూట, సంధ్యాకాలంలో, గ్రహణం కాని సమయాల్లో స్నానం చేయకూడదు. అలాగే వేడినీళ్ళతో కూడా స్నానం చేయకూడదు.
- చాతుర్మాస్యంలో అందరికీ, అన్నివిధాలా ఉత్కృష్టమైన కాలం. అందుకే ఈ కాలంలో పవిత్ర కర్మల్ని ఆచరించాలి.
- సత్సంగం, బ్రాహ్మణభక్తి, గురు, దేవ, పితృతర్పణాలు, గోదానం, వేదపఠనం, సత్కర్మాచరణ, సత్యభాషణ, గోభక్తి, దానాలు చేయటం మీద ప్రీతి కలిగి వుండటం ఇవన్నీ చాతుర్మాస్యంలో అందరూ ఆచరించాల్సిన ప్రధాన ధర్మాలు.
0 Comments