Ad Code

Responsive Advertisement

ఇష్టకామేశ్వరి అమ్మవారు - శ్రీశైలం

శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో రహస్య దేవాలయాలు దాగి ఉన్నాయి. నల్లమల అడవుల్లో 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు చెబుతారు స్థానికులు. కానీ అక్కడికి చేరుకోవడం చాలా చాలా కష్టం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు.ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునే వారు. పల్లవులు, విజయనగరరాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.

ఈ అమ్మవారి దర్శనం కేవలం శ్రీశైలంలో మాత్రమే మనకు లభిస్తుంది. భారతదేశంలో మరి ఎక్కడ అమ్మవారికి ఆలయం లేదు.

ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం మరో విశేషం. పురాణ ఇతిహాసాల్లో శ్రీశైలం క్షేత్ర మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైనది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినీ, కాశీ క్షేత్రాల తరువాత దక్షిణ భారతదేశంలో శ్రీశైలం క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధన విధానమంటూ లేదంటూ ఎటువంటి అతిశయోక్తి లేదు.





అమ్మవారు ముకుళిత నేత్రాలతో పద్మాసనంలో ధ్యాన నిమగ్నురాలై చతుర్భుజాలు కలిగి పైరెండు చేతుల్లో కలువ మొగ్గలు, కింది కుడిచేతిలో రుద్రాక్షమాల, ఎడమచేతిలో శివలింగాన్ని ధరించి ఉంటుంది.

పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

ఎలా వెళ్ళాలంటే : 

నల్లమల అరణ్యంలో శ్రీశైలానికి 21కి.మీ. దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లాలంటే ముందుగా 11కి.మీ.మేర శ్రీశైలం-దోర్నాల మార్గంలో ప్రయాణించి అక్కడి నుంచి 10కి.మీ. మేర దట్టమైన అరణ్యంలో వెళ్లాల్సి ఉంటుంది. అరణ్యంలో ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుంది. కొండరాళ్లతో కూడిన ఈ మార్గాన కమాండర్‌ జీపులు మాత్రమే వెళ్లగలవు. ఒక్కో జీపులో వెళ్లేందుకు కేవలం అయిదగురికే అనుమతి ఉంటుంది. అరణ్య మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అటవీశాఖ నిర్ణీత రుసుం వసూలు చేస్తుంది.

ఆలయ వేళలు : ఉదయం 5  నుండి సాయంత్రం  5 వరకు 

Post a Comment

0 Comments