Ad Code

Responsive Advertisement

శ్రీ చండీదేవి ఆలయం - హరిద్వార్

చండీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో  హరిద్వార్ నగరంలో ఉంది.  ఈ ఆలయం  హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై  ఉంది. ఈ ఆలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారు.



ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి మాయాదేవి దేవాలయం, మానసదేవీ ఆలయం.

ఈ దేవాలయం భారత దేశములోని ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. ఈ ఆలయంలోని  చండీ దేవి యొక్క విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు తెలుస్తోంది.


పూర్వకాలంలో "శుంభ", నిశుంభ" అనే రాక్షస రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుండి వెళ్లగొడతారు. దేవతల ప్రార్థనలను విన్న పార్వతి వారి రక్షణార్థం చండిగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు. ఆమె వ్యతిరేకిస్తుంది. ఆమె తిరస్కారాన్ని ఆగ్రహించిన శుంభుడు రాక్షస సేనాదిపతులైన "చండ", "ముండ" లను ఆమెను హతమార్చుటకు పంపిస్తాడు. వారు ఆమె క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా హతులౌతారు. శుంభ, నిశుంభులు కలసి చండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు కాని ఆమె చేతిలో మరణిస్తారు. వారిని వధించిన తర్వాత చండిక కొంతసేపు నీల్ పర్వతం పై విశ్రమించినట్లు పురాణ కథనం. అందువలన ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గల రెండు పర్వత శిఖరాల పేర్లు "శుంభ", "నిశుంభ".

ఆలయ వేళలు 

ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 వరకు  

ముఖ్యంగా చండీ చౌడాస్, నవరాత్రి ఉత్సవం, కుంభమేళాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ దేవాలయానికి అతి దగ్గరగా హనుమంతుని తల్లియైన "అంజన" దేవాలయం ఉంది. నీల పర్వతం క్రింది భాగంలో "నీలేశ్వర్ దేవాలయం" ఉంది. 

ఎలా వెళ్ళాలి   :

హరిద్వార్ లోని హర్ కీ పౌరికి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఈ దేవాలయానికి వెళ్ళుటకు "రోప్ వే" మార్గం కూడా ఉంది.

Post a Comment

0 Comments