Ad Code

Responsive Advertisement

శ్రీ కృష్ణ దేవాలయం - ఉడుపి


కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా మంగళూరుకి  సుమారు 60 కి.మీ దూరంలో అరేబియా సముద్రతీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది.'ఉడుప' అంటే చంద్రుడు.ఈ ఆలయంను  13వ శతాబ్దంలో నిర్మించారు.

తన మామగారైన దక్ష ప్రజాపతి వల్ల శాపం పొందిన చంద్రుడు. ఇక్కడ చంద్ర పుష్కరిణి అనే కోనేటి పక్కన ఉన్న చంద్రమౌళీశ్వరుని గూర్చి తపస్సు చేసి శాపవిమోచనం పొందాడని స్థలపురాణం.

ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుని విగ్రహం ద్వాపరయుగం నాటిదని ప్రతీతి. దీనిని ద్వైతమతాచార్యులైన మధ్వాచార్యులవారు ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలోని మూలవిరాట్ చేతిలో ఒక తాడు మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణాలు ధరించిన మంగళ రూపంతో  దర్శనమిస్తాడు.

తూర్పు, అభిముఖంగా ఉండే బాలకృష్ణుడు కనకదాసు అనే భక్తుని కరుణించుటకు వెనక్కి తిరిగి దర్శనమిచ్చాడని అందుకే పశ్చిమాభిముఖుడైనాడని భక్తుల విశ్వాసం. గర్భాలయం దగ్గర తూర్పు ద్వారాలు ఎప్పుడూ మూసి వుంటాయి.పశ్చిమవైపు గల కిటికీ యొక్క 9  గడుల రంధ్రముల నుండి మాత్రమే స్వామిని దర్శించగలము.

శ్రీకృష్ణ విగ్రహం కేవలం రెండున్నర అడుగుల ఎత్తు మాత్రం ఉన్నప్పటికీ, ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక్కడ నిత్యం శ్రీకృష్ణనామ స్మరణ, పారాయణం జరుగుతుంది. భక్తులందరూ పారవశ్యంతో భజనలు, కీర్తనలతో ఆ స్వామివారిని స్మరిస్తారు.

ఇంకా ఇక్కడ అనంతశయనుడు, చంద్రమౌళీశ్వర స్వామి దుర్గాలయాలు, నాగమందిరాలు మొ॥గు ఆలయాలు ఉన్నాయి.

ఆలయ వేళలు 

ఉదయం 4.30 నుండి రాత్రి 9.30 వరకు 

పూజ సమయాలు 

నిర్మల్య విసర్జన పూజ - 5.30
ఉషకాల పూజ - 6.00
అక్షయ పాత్ర గోపూజ - 6.15
విశ్వరూప దర్శనం - 6.20
పంచామృతాభిషేకం - 6.30
ఉద్వర్తన పూజ - 7.00
కలశ పూజ - 7.30
తీర్థ పూజ - 8.30
అలంకార పూజ - 10.00
అవసర సనకాది పూజ - 10.30
మహాపూజ - 11.00
చామరా పూజ - 7.00 (రాత్రి )
రాత్రి పూజ - 7.30
రంగ పూజ - 7.40
ఉత్సవ - 8.00
తోట్టులు పూజ - 8.30
కోలాలు పూజ - 8.40
ఏకాంత సేవ - 8.50

ముఖ్యమైన పండుగలు 

శ్రీకృష్ణాష్టమి ,ఉగాది,మత్స్య  జయంతి,శ్రీ రామనవమి ,హనుమజ్జయంతి ,కూర్మ  జయంతి ,అక్షయ  తృతీయ , నరసింహ  జయంతి , విజయ  దశమి ,దీపావళి ,నరకచతుర్దశి , గోపూజ ,రథసప్తమి 

ఎలా వెళ్ళాలి :

మణిపాల్ నుండి 5 కి.మీ దూరం
మంగళూరు నుండి 58 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :

కటీల్ దుర్గ పరమేశ్వరి అమ్మవారి ఆలయం - 44 కి.మీ దూరం
మంగళాదేవి ఆలయం - 62 కి.మీ దూరం
కొల్లూర్ మూకాంబిక ఆలయం - 76  కి.మీ దూరం.

Post a Comment

0 Comments