Ad Code

Responsive Advertisement

శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం

కాశీ విశ్వనాధుని ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనే నగరంలో వెలసింది.ఈ పట్టణం పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ఖ్యాతి పొందింది. ఇది సర్వ దేవతలకు నిలయం.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన యీ క్షేత్రంలో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు.



ఈ ఆలయంలో పరమేశ్వరుడు విశ్వనాధుడిగాను,  అమ్మవారి పేరు 'అన్నపూర్ణాదేవి'. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు నివసించిన స్థలం. విశ్వనాధుడు అనగా విశ్వం అంతటికి ప్రభువు అని అర్ధం. వరుణ - అసి అని రెండు నదులు ప్రవహించి నందువల్ల ఈ క్షేత్రం వారణాసి అయిందని చెబుతారు.

చతుర్విధ పురుషార్థములు పుట్టినిల్లయిన కాశీ నగరంలో ప్రతి అణువు పవిత్రమైనది.ఇది ఎంతో పవిత్రమైన క్షేత్ర తీర్థము గాయత్రిని మించిన మంత్రం లేదు. కాశీని మించిన క్షేత్రం లేదు. ఇది చాలా శక్తివంతమైన నగరం, ఎందుకంటే ఇది శివుని త్రిశూలంపై నిర్మింపబడిందని పురాణాల్లో వుంది. స్మరణమాత్రంచేత ముక్తి దాయకమై వర్ధిల్లుచున్న కాశీనగరాన్ని  పురాణాలు ప్రశసించాయి. మహాపురాణాలు, ఉపపురాణాలు కాశీఖండాన్ని పాప సంహార క్షేత్రంగా అభివర్ణించాయి. స్కాందపురాణ సారం కూడా యిదే.

ఈ కాశీ నగరంలో ధర్మం మూడు పాదాలుగా వుంటుందని అంటారు.ఈ నగరం అతి ప్రాచీనమైనది 3000 సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని పురాణాలు చెప్తున్నాయి. క్రీ.శ.1464లో, 1505లో ముస్లిం ప్రభువుల దాడివల్ల ధ్వంసమయిన తర్వాత, సుమారు 70 సంవత్సరాల కాలం పాటు విశ్వేశ్వరునికి పూజలు జరుగలేదు. తత్ఫలితంగా కరువు కాటకాలు సంభవించాయి. కొన్నాళ్ల తరువాత, హిందువులు, ముస్లిములు కలిసి గుడిని కట్టించారు.

విశ్వేశ్వరుని గుడికి సరిగ్గా ఎదురుగా అన్నపూర్ణాదేవి ఆలయం వుంది. ప్రక్కనే డుండి వినాయకుడు క్షేత్ర పాలనాధికారిగా కాలభైరవుడు న్యాయాధికారిగా వుంటాడని చెబుతారు భక్తులు తప్పకుండా మొట్టమొదట వినాయకుని సందర్శించి, ఆయన అనుమతితో విశ్వేశ్వరుని దర్శిస్తారు. అక్కడకి సమీపంలో విశాలాక్షి దేవాలయం వుంది. 

దేశదేశాలు తిరిగి చివరకు కాశీలో మరణిస్తే సాక్షాత్తు కైలాసం చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. నిరంతరం హరిశ్చంద్ర ఘట్టంలో శవాల దహనం జరగడంవల్ల దీనిని మహాస్మశానమని కూడా అంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన స్నాన ఘట్టాలు ఉన్నాయి. అందులో మణికర్ణిక, హరిశ్చంద్రఘట్టాలు ప్రముఖమైనవి.

దర్శనీయ స్థలాలు : కాశీ క్షేత్రం మొత్తం అణువణువునా ఆలయాలున్నాయి, కాలభైరవ దేవాలయం, సంకట విమోచన దేవాలయం, విశాలాక్షి మందిరం, వారాహీమాత మందిరం, దుర్గామాత, భారతమాత మందిరాలు, తులసీ మానస మందిరం యింకా ఎన్నో మందిరాలున్నాయి.100 స్నానఘట్టాలున్నాయి. అక్కడ పిండప్రదానాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 

కాశీని స్మరించినా, దర్శించినా, ఆ క్షేత్రాన్ని గూర్చి పఠించినా మోక్షఫలం లభిస్తుంది.

ఆలయ వేళలు :

ఉదయం 3.00 నుండి రాత్రి 11.00 వరకు 

అన్నపూర్ణా దేవి నిత్య కుంకుమార్చన, విశ్వేశ్వరస్వామికి నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి.

ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి అమలకి ఏకాదశి అన్నకూట్ మకర సంక్రాంతి శ్రావణ మాస ఉత్సవాలు అక్షయ తృతీయ

స్పెషల్ దర్శనాలు మరియు వసతి కోసం : https://shrikashivishwanath.org/

ఎలా వెళ్ళాలి 

దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుండి రవాణా సౌకర్యం వుంది.

Post a Comment

0 Comments