ఋషిపంచమీ వ్రతం || Rishi Panchami
- ఈ వ్రతాన్ని భాద్రపద పంచమి రోజున ఆచరిస్తారు.
- ఈ వ్రతాన్ని చేయడంవల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో తెలియక చేసిన దోషాలవల్ల కలిగే పాపాలన్ని హరించబడతాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.
- ఈ రోజున సూర్యోదయం కంటే ముందుగా నదీలో కాని, చెరువులో కానీ, లేదా బావివద్దనో స్నానాన్ని చేయాలి.
- తరువాత సప్త ఋషులను,వారి పత్నులను పూజించి నానబెట్టిన శనగలు నివేదనగా సమర్పించాలి.
- ఈ రోజు పడి మొలచిన కూరలను మాత్రమే తినాలి, ఆలా దోరకం కష్టం కనుక కూరలకు దూరంగా ఉండడం మంచిది.
- స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని చెప్పబడినది.
- ఈ వ్రతాన్ని ముత్తైదువులతోపాటు వితంతువులు కూడా ఆచరించవచ్చు.
- అయితే భర్త జీవించివున్నప్పుడు కనీసం ఒకసారైనా ఈ వ్రతాన్ని ఆచరించి వున్నట్లైతేనే వితంతువులు ఈ వ్రతాన్ని చేయడానికి అర్హులు.
0 Comments