Ad Code

Responsive Advertisement

శ్రీ ఏకవీర దేవి ఆలయం - మహూర్‌గడ్‌

 

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు నాందేడ్‌కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరమున మహూర్‌గడ్‌ అనే క్షేత్రం అమ్మవారు వెలిశారు.  సతీదేవి కుడిస్తనం పడిన మహిమాన్విత క్షేత్రంగా ఈ ఆలయం  విలసిల్లుతోంది.


ఇక్కడ అమ్మవారు సింధూర రంగులో దర్శినమిస్తారు. 


మహూర్‌ బస్‌స్టాండ్‌కు దాదాపు 3 కి.మీ. దూరంలో ఎత్తైన పర్వతంమీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. రేణుకాదేవినే శ్రీ ఏకవీరికాదేవిగా కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందింది ఏకవీరాదేవి శక్తిపీఠం.


ఈ ఆలయం చాల ప్రాచీనమైనది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. ముందుగా శ్రీ పరశురామ్‌ గణేష్‌ దర్శనము చేసుకున్నాక తరువాత రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు.


అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. చక్కటి అలంకారంతో ఉన్నా కాస్త భయానకంగా కూడా దర్శమిస్తుంటుందీ ఏకవీరాదేవి.మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉంటుంది. మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది.


ఇక్కడ అమ్మవారికి  ప్రతిమకు కుంకుమార్చన చేస్తారు.


ఈ ఆలయంలో ఇంకా శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరములు చూడదగినవి.

Post a Comment

0 Comments