Ad Code

Responsive Advertisement

తొలిస్థానం తిరుమలదే

ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే ఆలయాల్లో తిరుమల దేవస్థానం తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది తిరుమల బడ్జెట్‌ 2900 కోట్ల రూపాయల దాకా ఉంది. 



 అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే హిందూ దేవాలయం తిరుమలే. 

తిరుమల హుండీ ఒక్కరోజు రికార్డు కలెక్షన్‌ 5.73 కోట్ల రూపాయలు. 


తిరుమలలో రోజుకు సుమారు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో ఒక్కటోపీలూ, శ్రీవారి ఫొటోలే 70 లక్షల రూపాయల దాకా వ్యాపారానికి మూలం. 


మూలవిరాట్టుకు నిత్యం 120 రకాల ఆభరణాలు అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి 383 విభిన్న రకాల ఆభరణాల్ని అలంకరిస్తారు. 


శ్రీవారి బంగారు పీతాంబరం 40 కిలోల వరకూ బరువుంటుంది. 


వేంకటేశ్వరుడి ఆభరణాల్లో అరకిలో బరువుండే అరుదైన గరుడమేరు పచ్చ ఉంది. ప్రత్యేకపూజలూ, ఉత్సవాల్లో అలంకరిస్తారు. 


శ్రీనివాసుడి ఉత్సవాలకి స్వర్ణరథం ఉంది. 74 కిలోల బంగారాన్ని ఉపయోగించారు.

 
స్వామికి నిత్యం హుండీ ద్వారా వచ్చే వెండి సుమారు 7 కిలోల దాకా ఉంటుంది. 


ఆసియాలోనే అతిపెద్ద వంటశాల తిరుమల తిరుపతి దేవస్థానం సొంతం. రోజుకి లక్షమంది ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. 


శ్రీవారి పేరిట అన్నదానం చేస్తోన్న తరిగొండ వెంగమాంబ ట్రస్టుకి రోజుకి 5వేల కిలోల కూరగాయల్ని భక్తులు ఉచితంగా అందజేస్తున్నారు. ప్రత్యేక దినాల్లో 10 వేల కిలోల వరకూ అవసరమవుతున్నా అంతా భక్తుల ద్వారానే అందుతోంది. 


స్వామి పుష్ప ప్రియుడు అందుకే దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచీ తిరుమలకు నిత్యం 15 వేల కిలోల వరకూ పువ్వులు చేరతాయి. కేవలం స్వామి పూజ, అలంకారానికే 500 కిలోల వరకూ పువ్వుల్ని వినియోగిస్తున్నారు. మొత్తం 200 మంది దాకా ఈ పువ్వుల్ని మాలలుగా కట్టేందుకూ, దేవస్థానం సహా పలు కాటేజీలూ, వసతి భవనాల్లో అలంకరించేందుకు పనిచేస్తున్నారు. ఇవన్నీ శ్రీవారికి భక్తుల కానుకలుగా చేరుతున్నవే. పువ్వుల కోసం టీటీడీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు.

Post a Comment

0 Comments