Ad Code

Responsive Advertisement

విజయ ఏకాదశి


  • విజయ ఏకాదశి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది
  • ఈ ఏకాదశి గూర్చి స్కంద పురాణంలో వివరించబడింది 
  • ఈ ఏకాదశి యొక్క ఆచరణ గురించి బ్రహ్మ, నారదుడికి వివరించాడు
  • శ్రీ రాముడు ఈ ఏకాదశిని ఆచరించిన తరువాతే సముద్రం దాటి లంకకు వెళ్లి రావణుడిని వధించాడు అని చెబుతారు.
  • ఈ రోజు ఏకాదశి వ్రతం  ఆచరించిన వారికీ తప్పక విజయం లభిస్తుంది అని చెబుతారు.
  • ఈ ఏకాదశి ముందు రోజు రాగి లేదా మట్టికుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దాన్ని సప్తధాన్యాలతో అలంకరించిన వేదిక పై ఉంచి దానిపై నారాయణుని నిలపాలి. 
  • ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానము చేసి తులసీదళాలు, గంధాన్ని, పూలను, పూలమాలను ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి. 
  • బ్రహ్మచర్యం పాటించాలి 
  • మరునాడు ఆ పాత్రను నదీతీరంలో యధావిధంగా పూజించాలి , తరువాత దానిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. 
  • ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞఫలాన్ని పొందుతాడు. 
  • సాధారణంగా ఏకాదశి రోజు చేయవలసిన నియమాలు ఈరోజు చేస్తారు.

2021 : మార్చి 9. 

Post a Comment

0 Comments