Ad Code

Responsive Advertisement

కుమారి అమ్మన్ దేవాలయం - కన్య కుమారి

కుమారి అమ్మన్ ఆలయం 3000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారి. అమ్మవారు ఇక్కడ కన్యదేవతగా పూజలు అందుకుంటు భక్తులను రక్షిస్తున్నారు. అమ్మవారిని పార్వతి దేవి అవతారంగా భక్తులు ఆరాధిస్తారు.కన్యాకుమారి సముద్రతీరంలో ఈ దేవాలయం ఉంది.



స్థల పురాణం

బానసుర అనే రాక్షస రాజు దేవతలా మీద అధికారం పొంది, వాళ్లను అనేక ఇబ్బందులతో పాటు క్రూరంగా హింసించసాగాడు. 

దేవతలు రాక్షస రాజును శిక్షించటానికి  ఒక యజ్ఞం మొదలు పెడతారు. అప్పుడు అమ్మవారు కన్య అమ్మాయి  రూపంలో తపస్సు ప్రారంభిస్తుంది. ఇంతలో శివుడు ఆమెతో ప్రేమలో పడి ఒక రోజు అర్ధరాత్రి వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాడు.

ఈ విషయం తెలుసుకున్న నారదుడు శివుడికి సమయం మించి పోయేలా చేస్తాడు. ఎందుకు అంటే కన్యకు  మాత్రమే బానసురని చంప గల శక్తి ఉంటుంది. దింతో శివుడు నిరాశతో వెళ్లిపోతాడు. అమ్మవారు కన్యగా అక్కడ ఉండిపోతారు.అమ్మవారు చక్రాగుద అనే ఆయుధంతో రాక్షసుని వధించి దేవతలకు విముక్తి కలిగిస్తుంది. తరువాత అమ్మవారు కన్యగా అక్కడ ఉండిపోతుంది.

  • అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటి.
  • 108 దుర్గాదేవి ఆలయాలలో ఈ ఆలయం ఉంది.
  • శ్రీ రామకృష్ణ పరమహంస ఆదేశం మేరకు 1892  లో  స్వామి వివేకానంద ఈ ఆలయాన్ని సందర్శించారు.
  • అమ్మవారు ముక్కుకు ఉన్న రింగు , రాత్రి సమయాలలో  కూడా చాల దూరం నుంచి కనిపిస్తుంది.
  • అమ్మవారు ముక్కుకు ఉన్న రింగు ప్రకాశిస్తుండం వల్ల రాత్రి సమయాలలో సముద్రంలో వెళ్తున్న నౌకలు పడిపోయివి. అందువల్ల అమ్మవారు ఆలయ తూర్పు ద్వారం మూసివుంటుంది.
  • అమ్మవారు ఆలయ తూర్పు ద్వారం పౌర్ణమి రోజులో, మలయాళ మాసాలైనా ఏడవం , కార్కిదకం, వ్రిశ్చికం, మరియు నవరాత్రి రోజులు తెరిచి ఉంటుంది.


ఆలయ వేళలు : ఉదయం 06.00  నుండి 12.30 వరకు 
                             సాయంత్రం 04.00 నుండి 08.00 వరకు .

ఆలయంలో పండుగలు / పర్వదినాలు :

చైత్ర పౌర్ణమి 

దసరా నవరాత్రులు 

వైశాఖ మాసంలో 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి.

తమిళ మాసమైన ఆది మాసంలో కలాభం ఉత్సవం జరుపుతారు. అప్పుడు ఆఖరి శుక్రవారం అమ్మవారికి చందనంతో అలంకరిస్తారు.

ఆలయం కి ఎలా చేరుకోవాలి :

బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి ఆలయం 1 కిలోమీటర్ దూరంలో ఉంది.

వసతి సౌకర్యాలు :

హోటలు అందుబాటులో ఉన్నాయి.

చుట్టూ పక్క చూడవలసిన ఆలయాలు 

  • సుబ్రమణ్య స్వామి ఆలయం కన్యాకుమారి నుండి 34  కి.మీ దూరంలో ఉంది.
  • సూచిండ్రమ్ లో ఉన్న తనుమాయన్ ఆలయం.

Post a Comment

0 Comments