Ad Code

Responsive Advertisement

మధ్వ నవమి

భారతివనిలో ధార్మికవాదాన్ని ముందుకు తీసుకువెళ్లిన మూడు ప్రధాన వాదాలు ద్వైతాద్వైత సిద్ధాంతాలు. వీటిలో శ్రీ విష్ణు సర్వోమత తత్వ సిద్ధాంతమైన ద్వైతవాదాన్ని ప్రతిష్టించిన వారు శ్రీ మద్వాచార్యులు.

  • వీరు 1238 లో కర్ణాటకలోని పాజక అనే ప్రాంతంలో జన్మించారు. 
  • స్వామివారికి పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ అనే పేర్లు కూడా వ్యవహారంలో ఉన్నాయి.
  • వీరి రచనలకు సర్వములా గ్రంధాలని పేరు.
  • శ్రీ హరి సర్వోత్తముడు, జీవులలో ఉత్తముడు వాయువు, భక్తియే ముక్తికి మార్గం - ఇదే మద్వాచార్యులు ప్రబోధించిన ద్వైత సిద్ధాంతం.
  • ఆసేతు హిమాచలం కాలినడకన పర్యటించి వైష్ణత్వ యదార్ధరూపాని ప్రచారం చేసారు.
  • మద్వాచార్యులు ఉపనిషతులకు భాష్యం చెబుతూ , అదృశులైనారు అని భక్తులు విశ్వసిస్తారు.
  • ఆలా అయన సశరీరంగా అదృశులైన రోజు మాఘ శుద్ధ నవమి.
  • మధ్వ నవమి ఉత్సవాలు భక్తులు 9  రోజుల పాటు నిర్వహిస్తారు. మధ్వ సంప్రదాయం అనుసరించే మఠాలలో పాటుగా, దేశ విదేశాలలో  మధ్వ నవమిని నవదినోత్సవ ఉత్సవాలుగా నిర్వహిస్తారు.
  • ఉడిపి లో అనంతేశ్వరాలయంలో, మంత్రలయంలోని  శ్రీ గురు రఘ్వవేంద్ర స్వామి సన్నిధిలో మధ్వ నవమి సంబరాలు వైభవంగా జరుగుతాయి.


2019 : ఫిబ్రవరి , 14. 

Post a Comment

0 Comments