Ad Code

Responsive Advertisement

పురుహూతికా దేవి ఆలయం - పిఠాపురం

పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  తూర్పు గోదావరి జిల్లాలో ఉంది ఈ ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కటైనా ఈ క్షేత్రం స్వయంభు కుక్కుటేశ్వర క్షేత్రంగాను, మూడు గయలలో ఒక్కటైనా పాదగయ క్షేత్రంగాను, పంచమాధవ క్షేత్రాలలో ఒక్కటైనా కుంతీ మాధవ క్షేత్రంగాను, శ్రీ పాదవల్లభుల జన్మస్థానమైన దత్తక్షేత్రంగాను పేరు పొందింది.



ఈ క్షేత్రంలో సతీదేవి  యొక్క పీఠభాగం పడినట్లుగా చెప్పబడుతుంది.అమ్మవారి పీఠభాగం పడటం చేతనే ఈ క్షేత్రం పిఠాపురం అయింది అని స్థానిక కధనం.

స్కందపురాణంలోను, వాయుపురాణంలోను ఈ క్షేత్ర ప్రాశస్త్యం చెప్పబడింది. మోక్షాన్ని ప్రసాదించే నాలుగు క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒక్కటిగా పేర్కొనబడింది.

పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వరుడై స్వయంగా వెలసిన కారణంగా ఈ క్షేత్రానికి స్వయంభు కుక్కుటేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది.
క్షేత్ర స్థల పురాణం ప్రకారం ప్రధానంగా గయాసురునితో మూడుపడి ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షస రాజు తపస్సుచేత శివుని మెపించి, భూమండలంలోని అని ప్రదేశాలకన్నా అతని శరీరం అత్యంత పవిత్రమైనదిగా ఉండే వరాన్ని పొందాడు. 

అతని అనుచరులు జనులను పీడించ సాగారు. గయాసురుడు కూడా ఇంద్రుని జయంచి, ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించసాగాడు. అప్పుడు ఇంద్రుడు త్రిమూర్తుల నుంచి వరం పొందాడు. తరువాత త్రిమూర్తులు బ్రాహ్మణా రూపాలలో యాగం చేయడానికి అతని సహకరించమని కోరారు.

భూమండలంలో స్థలం ఎక్కడ అనువుగా లేదు అని, గయుని దేహమే యజ్ఞ నిర్వహనుకు అనువైన స్థలం అని అనుకున్నారు.అందుకు గయుడు అంగీకరించాడు.యజ్ఞం పూర్తీ అవడానికి ఏడు రోజులు పడుతుంది అని అప్పటికి వరకు గయాసురుడు దేహాన్ని కదలించకూడదు అని షరతు విధించారు. 

ఏడవ రోజు అర్ధరాత్రే శివుడు కుకుటంగా అంటే కోడి పుంజు గా మారి కూత పెట్టాడు. దాంతో గయుడు శరీరం కదిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి గయాసురుడిని సంహరించాడు. గయుడు శరీర భాగాలు కూడా పుణ్య ధామాలుగా వెలిసాయి.

ఈ సందర్భంలోనే పరమేశ్వరుడు కుక్కుటేశ్వరునిగా, అమ్మవారు పురుహూతికా దేవిగా వెలసింది.

ఆలయ వేళలు :

ఉదయం : 5.30 - 12.30 

సాయంత్రం : 4.30 - 7.30 

ముఖ్యమైన పండుగలు :

కార్తీకమాసంలో విశేష  పూజలు  చేస్తారు.
మాఘమాసంలో స్వామి వారికీ కల్యాణోత్సవం చేస్తారు.
దసరా నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు.

దేవస్థానం వారి గదులు అందుబాటులో ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి

కాకినాడకు 18 కి.మీ దూరంలో 
అన్నవరానికి 22 కి.మీ దూరంలో 
రాజమండ్రికి 55  కి.మీ దూరంలో  ఉంది ఈ ఆలయం.


Post a Comment

0 Comments