Ad Code

Responsive Advertisement

మానస దేవి అమ్మవారి దేవాలయం - హరిద్వార్.

మానస దేవి అమ్మవారి దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ లోఉంది.  ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ ఆలయం  హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతోంది.ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు అని భక్తుల నమ్మకం.



ఈ ఆలయం 1810  - 1815  మధ్య నిర్మిచారు అని చారిత్రిక అధరాల  ద్వారా  తెలుస్తుంది.

ఇక్కడ ఒక ఆవు రోజు శివాలిక్ కొండా ప్రాంతం మీద ఉన్న మూడు శిలాల మీద పాల దారాలు కారుస్తుండేది. ఇది గమనించిన కొంత మంది అక్కడ సతిదేవి యొక్క తలను చూసి దేవాలయం నిర్మించారు అని చెబుతారు.

ఈ ఆలయంకి చేరుకోడానికి కొండా మీద నడవం కానీ రోప్-వే ద్వారా కానీ మనం ఈ ఆలయం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి హరిద్వార్ అందాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ కొండా ప్రక్కనే చండి దేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది.

మనసాదేవి మరియు చండి దేవి ఇద్దరు పార్వతి అమ్మవారి అంశ అని భక్తుల నమ్మకం.

ఆలయ వేళలు : ఉదయం 5   నుండి రాత్రి 9  వరకు.

నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి.

చుట్టు ప్రక్కన చూడవలసిన ప్రదేశాలు.
  • చండి దేవి ఆలయం, హరిద్వార్ 
  • హరికి పౌరి
  • నీలేశ్వర్ దేవాలయం 
  • మాయ దేవి ఆలయం.
ఎలా వేలాలి :
  • హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
  • హరిద్వార్ కి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది
  • డెహ్రాడూన్ విమానాశ్రయం హరిద్వార్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.


Post a Comment

0 Comments