Ad Code

Responsive Advertisement

క్షీరారామం - పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం

పాలకొల్లు  క్షీర  రామలింగేశ్వర  స్వామి వారి  ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పంచారామ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. స్థానికులు ఈ ఆలయంని పెద్ద గోపురం అని కూడా పిలుస్తారు.



ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. 14 వ శతాబ్దంలో ఈ ఆలయ రాజగోపురం కటించినట్లు తెలుస్తుంది. 17 వ  శతాబ్దంలో ఈ ఆలయంలో కల్యాణ మండపము నిర్మించారు.

పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.



పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. 

ఇంకా ఈ ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి, పార్వతి దేవి, లక్ష్మి దేవి , వీర భద్ర స్వామి, కనకదుర్గ అమ్మవారు, నటరాజ స్వామి రాధాకృష్ణులు కొలువై వున్నారు.

ఆలయ వేళలు : ఉదయం 6 నుంచి రాత్రి 8  వరకు.

ఎలా వేలాలి :

భీమవరం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. భీమవరం నుంచి పాలకొల్లు  25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రైలు అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0 Comments