Ad Code

Responsive Advertisement

శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం - శ్రీనివాస మంగాపురం.

శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతి కి కేవలం 12  కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ స్వామి వారు కల్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు.



శ్రీ వేంకటాచల మహత్యం ప్రకారం, పద్మావతి అమ్మవారి ని పరిణయమాడిన శ్రీవారు అగస్త్య ముని సలహా మేరకు 6 నెలలు శ్రీవారు తిరుమలకు వెళ్లకుండా ఈ క్షేత్రంలోనే ఉన్నారు.

13 వ శతాబ్దంలో సుల్తానుల కాలంలో ఈ ఆలయం కొంత ద్వాంసం అయింది. 16 వ శతాబ్దంలో అన్నమాచార్యుల మునిమనవాడైన శ్రీ తాళ్ళపాక చిన్న తిరుమల ఆచార్యులవారు ఈ ఆలయాన్ని పున్నఉద్దరించారు . చాల కాలం పాటు ఈ ఆలయం బాధ్యతలు తాళ్ళపాక వారు చూసే వారు. 1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది.


  • ఇక్కడ స్వామి వారు మనకు పశ్చిమ అభిముఖంగా  దర్శనం ఇస్తారు. 
  • కొత్త పెళ్లైన నవ దంపతులు స్వామివారి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని నమ్ముతారు.
  • తిరుమల లో శ్రీవారిని తృప్తిగా దర్శించుకోలేని భక్తులకు,శ్రీ వారు ఇక్కడ ఆ  లోటు లేకుండా చేస్తారు.
  • తిరుమల తరువాత అత్యంత ప్రసిధి పొందిన ఆలయం వెంకటేశ్వర స్వామి  ఇది.
  • ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. 
  • తిరుమలలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
  • అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. 
  • ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
  • ప్రతిరోజు స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు .

ఆలయవేళలు : ఉదయం 5.30  నుండి  రాత్రి 7.30   వరకు.

ప్రతి ఏటా స్వామి వారికీ మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.


ఎలా వేలాలి : తిరుపతి కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వుంది. శ్రీవారి మెట్టు వేళే మార్గంలో ఈ ఆలయం వస్తుంది. 

సొంత వాహనాలు లేకపోయినా apsrtc బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

0 Comments