Ad Code

Responsive Advertisement

దక్షిణాయనం అంటే ఏమిటి?

భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు.  సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల  ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.

దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది. ఉత్తరాయణం దేవతలకు ప్రాతినిధ్యం వహించేది కాగా, దక్షిణాయనం పితృదేవతలకు ప్రాతినిధ్యం వహించే కాలంగా పరిగణిస్తారు.




ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహాలయ  పక్షాలు వస్తాయి.

నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.

నాలుగు నెలల దీక్ష అయిన చాతుర్మాస్యం దక్షిణాయనం లోనే వస్తుంది. చాతుర్మాస్యం నాలుగు మాసాలూ కూడా ఈ కాలంలోనే ఉండడం వల్ల ఈ సమయంలో విష్ణు మూర్తి ఆరాధన విశేష ఫలాలు ఇస్తుంది. దక్షిణాయనంలో ముఖ్యంగా చేయవలసిన  కార్యక్రమాలు కొన్ని పెద్దలు చెబుతారు. 

వాటిలో కొన్ని ఇవి:

ధ్యానం, మంత్ర జపాలు చేయడం 

సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం

పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం

సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం 

అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం,

విష్ణు పూజ, విష్ణు సహస్రనామం చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి.

2021 : జులై 16.

Post a Comment

0 Comments