Ad Code

Responsive Advertisement

గోవిందారాజా స్వామి వారి ఆలయం - తిరుపతి

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో ఉంది. చిత్తూరు జిల్లా అతిపెద్ద దేవాలయాలలో ఈ ఆలయం ఒక్కటి. ఇక్కడ వెలసిన గోవిందరాజ స్వామి వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ అన్న అని అంటారు. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదీనంలో ఉంది.



ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమచారాన్ని అందిస్తున్నాయి. అన్నింటికంటె పాత శాసనం ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రథం నిమిత్తం, మరి కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించింది. 1506లో విజయ నగర రాజుల సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది.



ఒక కథనం ప్రకారం: చిదంబరంలో వున్న గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 24-2-1130 లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనె శ్రీ ఆండాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. గోవింద రాజ స్వామి వారి విగ్రహం రాక ముందు నుండి అక్కడ పార్థ సారధి విగ్రహం వుండేది. దీని ఉత్తర దిశలో గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో వుత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.


  • ఆలయ గోపురం చాల దూరం నుంచి మనకు కనిపిస్తుంది.
  • ఈ ఆలయంలో ఉత్తర భాగంలో శ్రీ గోవిందా రాజా స్వామి వారు, దక్షిణ భాగంలో శ్రీ పార్థసారధి స్వామి వారు దర్శినమిస్తారు.
  • ఈ ఆలయంలో రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు కూడా  దర్శినమిస్తారు.
  • ఈ ఆలయ సముదాయం లో చాలా ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో శ్రీ పార్థసారధి ఆలయం, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ముఖ్యమైనవి.
  • పుండరీకవల్లి , ఆండాళ్ , చక్రతాళ్వార్ , ఆళ్వార్లు , లక్ష్మి  నారాయణ  స్వామి , ఆంజనేయ , తిరుమల  నంబి , భాష్యకార్లు కూడా ఈ ఆలయంలో కొలువైవున్నారు . 



ఆలయ వేళలు : ఉదయం 5.30  నుంచి రాత్రి 9.30.

ముఖ్యమైన పండుగలు :

ప్రతి రోజు పండుగ వాతావరణం ఉన్నప్పటికీ. శనివారం మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ ఆలయంలో దాదాపు అని పండుగలు విశేషంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, రథ సప్తమితో పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. 



పరిసరాలలో వున్నా ఆలయాలు :

శ్రీ కోదండ స్వామి వారి ఆలయం 

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం - తిరుచానూరు.

శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం - శ్రీనివాస మంగాపురం.

శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం - కార్వేటి నగరం. 

ఎలా వేలాలి :

తిరుపతి రైల్వే స్టేషన్ కి అతి దగరలో ఈ ఆలయం ఉంది. 




Post a Comment

0 Comments