Ad Code

Responsive Advertisement

శ్రీ జంబుకేశ్వర స్వామి వారి ఆలయం - తిరుచిరుపల్లి

పరమేశ్వరుడు జలరూపంలో జంబుకేశ్వరునిగా వెలసిన క్షేత్రం జంబుకేశ్వరం. ఈ పుణ్య స్థలం కావేరి నదీతీరాన వుంది.ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరి.

పూర్వం ఈ ప్రాంతంలో జంబూ వృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా వున్నా కారణంగా ఈ ప్రాంతానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది.

11 వ శతాబ్దంలో చోళరాజుల ఈ ఆలయాన్ని నిర్మించారు. పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు. 

ఈ ఆలయం సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలతో ఎంతో విశాలంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు వున్నాయి. స్వామివారి ఆలయానికి దగ్గరలోనే   అమ్మవారి ఆలయం వుంది. 

ఈ లింగం నీటితో ఏర్పడిందికానీ, నీటిలో వున్న శివలింగం కానీ కాదు. ఈ జలలింగం చుట్టూ ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది.పానవట్టం చుట్టూ ఎప్పుడు ఒక వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఉరే నీటిని ఈ వస్త్రం పీల్చుకుంటూ ఉంటుంది. వస్త్రం కప్పిన కొద్దీ సేపటికే తడిసి ముద్దా అవుతూ ఉంటుంది.

ఇక్కడ స్వామివారిని స్వయంగా అమ్మవారు ఆరాదించిందట. అందుకే ఈ ఆలయంలో నిర్ణిత సమయంలో అర్చకులు చీరను ధరించి స్త్రీ వేషంలో స్వామివారిని అర్చిస్తారు. ఈ విశేషాన్ని భక్తులు కూడా చూడవచ్చు. 

ప్రతిరోజు మధ్యాహ్నం ఒక ఏనుగు గర్భాలయానికి వెళ్ళి స్వామిని పూలమాలతో అలంకరిస్తోంది. ఈ దృశ్యాన్ని భక్తులు చూడవచ్చు.

స్థల పురాణం :

పూర్వకాలంలో ఈ ప్రాంతంలో శంభుడనే ఋషి నివసించేవాడు. అయన గొప్ప శివభక్తుడు. రోజుకు ఆరుసార్లు విధివిధానంగా శివుణ్ణి అర్చించేవాడు. ఒక సారి శంభునికి ఎప్పుడు శివుణ్ణి అర్చించాలి అని కోరిక కలిగింది, దానితో శివుని కోసం తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రతక్షమై తాను ఇక్కడ జలలింగంగా కొలువుతీరేవిధంగా, శంభుడు స్వామి ఎదురుగా జంబూ వృక్షంగా మారి దర్శించుకునే విధంగా వరాన్ని ప్రసాదించాడు. 

ముఖ్యమైన పండుగలు :

మార్చి - ఏప్రిల్ మాసంలో పంగూని బ్రహ్మోత్సవం
జులై - ఆగష్టులో ఆది పూరం
దసరా నవరాత్రులు
మహాశివరాత్రి 
తై పూసం
వసంత ఉత్సవం.

ఆలయ వేళలు

ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు 
సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 వరకు.

ఎలా వెళ్ళాలి :

తిరుచిరుపల్లి నుండి 10 కి.మీ
శ్రీరంగం నుండి 2 కి.మీ 

ఈ ఆలయం నుండి శ్రీరంగం ఆలయం 2 కి.మీ.

Post a Comment

0 Comments